For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా: లీకైన ఫొటోలో అతడిపై వాలిపోయి.. ముఖం కనిపించకుండా జాగ్రత్త పడడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ తమ మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో వర్షిణి సౌందరాజన్ ఒకరు. మోడలింగ్ రంగంలో అడుగులు వేసి కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన టాలెంట్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేసే అందంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనికి కారణం ఇందులో వర్షిణి.. వేరే వ్యక్తిపై పడుకుని ఉండడమే. ఆ వివరాలు మీకోసం!

  Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life
  మోడల్ నుంచి సినిమా టూ టీవీ షోలు

  మోడల్ నుంచి సినిమా టూ టీవీ షోలు

  చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్షిణి. ఈ క్రమంలోనే ఎన్నో షోలు, ఈవెంట్లు, వ్యాపార ప్రకటనల్లో పాల్గొంది. అలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ‘చందమామ కథలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, వరుసగా అవకాశాలను అందుకోవడంలో మాత్రం ఈ బ్యూటీ విఫలం అయింది.

  నిలబెట్టిన ‘పెళ్లి గోల’.. అలా పరిచయం

  నిలబెట్టిన ‘పెళ్లి గోల’.. అలా పరిచయం

  పలు సినిమాల్లో నటించినప్పటికీ... వర్షిణికి అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నిగిల్లాయి. అలాంటి సమయంలో ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ'తో టెలివిజన్ రంగంలోకి అడుగెట్టింది.

  మూన్ వాక్ స్పెషలిస్టుగా పేరొందిందిగా

  మూన్ వాక్ స్పెషలిస్టుగా పేరొందిందిగా

  ‘ఢీ' షోలో గతంలో వర్షిణి ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్'లో యాంకర్‌గా చేస్తోంది. ఇందులో అందచందాలతో అదరగొడుతోన్న ఈ భామ.. కుర్రకారు హృదయాలకు గాయాలు చేస్తోంది.

  ఇద్దరు కమెడియన్లతో ట్రాకులు.. క్లారిటీ

  ఇద్దరు కమెడియన్లతో ట్రాకులు.. క్లారిటీ

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకు వర్షిణి... జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య ఆమె మరో కమెడియన్ హైపర్ ఆదితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ‘ఢీ'లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఈ రెండింటినీ ఖండిస్తూ ఆమె పలుమార్లు ప్రకటనలు కూడా చేసింది.

  అందులో ఫుల్ బిజీగా.. రచ్చ చేస్తుంది

  అందులో ఫుల్ బిజీగా.. రచ్చ చేస్తుంది

  వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... వర్షిణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక, ఈ మధ్య అమ్మడు హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసి మరీ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వదిలింది.

  అతడిపై వాలి.. ముఖం కనిపించకుండా

  అతడిపై వాలి.. ముఖం కనిపించకుండా

  ఇటీవల యాంకర్ వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ వ్యక్తి భుజంపై వాలిపోయి కనిపించింది. అతడి మీద పడుకుని కళ్లు మూసుకుని మరీ పరవశించిపోతోంది. కానీ, ఈ పిక్‌లో ఉన్న వ్యక్తి ఎవరో ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో ఈ ఫొటోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా ఏంటి?

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా ఏంటి?

  వర్షిణి షేర్ చేసిన ఫొటోను చూసిన వారంతా.. అందులో ఉన్న వ్యక్తి ఎవరన్నది చూపించకపోవడంతో ఆమె ఎవరితోనే ప్రేమలో పడిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. మరికొందరైతే పెళ్లి చేసుకోబోతుందని కూడా కామెంట్లు పెడుతున్నారు. దీంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తద్వారా ఈ హాట్ యాంకర్‌ బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

  English summary
  Varshini Sounderajan is an Indian actress and model who appears mostly in Telugu films. She made her acting debut in the National award-winning film Telugu anthology film Chandamama Kathalu in the year 2014.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X