Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైరల్ వీడియో: డ్యాన్స్ మాస్టర్‌కు యాంకర్ వర్షిణి లవ్ ప్రపోజల్.. రొమాంటిక్‌గా చెప్పడంతో ఫ్లాట్.!
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో చాలా మంది అందంతో నెగ్గుకు వస్తున్న వారే ఉన్నారు. ఈ లిస్టులో హాట్ బ్యూటీ వర్షిణి పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మోడలింగ్‌తో కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఇప్పుడు చెప్పుకోదగ్గ యాంకర్‌గా ఎదిగిపోయింది. శామిలి సౌందరాజన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. తర్వాత వర్షిణిగా పేరు మార్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఓ డ్యాన్స్ మాస్టర్ ప్రేమలో పడిపోయింది. తాజాగా ఆయనకు ప్రపోజ్ కూడా చేసింది. ఆ వివరాలు మీకోసం.!
వర్షిణి.. ముందు అక్కడే కనిపించింది
ఆకట్టుకునే అందంతో పాటు యాక్టింగ్ చేయగల సామర్ధ్యం ఉండడంతో వర్షిణి మోడలింగ్ నుంచి నేరుగా సినిమాల వైపు వెళ్లింది. అక్కడ ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్'తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కొందరు టీవీ దర్శకుల కంట్లో పడింది. దీంతో ఆమెను పలు షోలకు యాంకర్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.
శ్రీముఖి నిర్ణయం.. ఈమెకు కలిసొచ్చింది
వరుస షోలతో బిజీ బిజీగా గడిపిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి.. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లింది. దీంతో ఆమె అప్పటి వరకూ పని చేసిన స్టాండప్ కామెడీ షో ‘పటాస్'కు వర్షిణిని యాంకర్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె అందులో చేస్తోంది. కో యాంకర్లు మారినా వర్షిణి మాత్రం ఆ షోలో కొనసాగుతోంది.
అందులో స్పెషలిస్ట్.. మామూలుగా ఉండదు
ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లోనూ వర్షిణి పని చేస్తోంది. ఈ షోకు రెండు సీజన్ల నుంచి ఆమె టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఆ షోలో ఆమె డ్యాన్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ఆమెకు డ్యాన్స్ అంతగా రాకపోవడమే. అయినప్పటికీ తనదైన శైలితో మూన్ వాక్ చేసి నవ్వులు పూయించింది.
జబర్ధస్త్ కమెడియన్‌తో అదిరిపోయే రొమాన్స్
ఇక, ఇటీవల ‘ఢీ' డ్యాన్స్ షోలోకి జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఎంటర్ అయ్యాడు. ఆయన వర్షిణితో కలిసి ఓ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బంధం గట్టిపడింది. దీంతో ఈ ఇద్దరూ కలిసి లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే వర్షిణి - హైపర్ ఆది రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
డ్యాన్స్ మాస్టర్‌కు యాంకర్ వర్షిణి లవ్ ప్రపోజల్
తాజాగా యాంకర్ వర్షిణి చేసిన ఓ పని అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘ఢీ' డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ఆమె లవ్ ప్రపోజ్ చేసింది. అందరూ చూస్తుండగానే మోకాళ్లపై కూర్చుని మరీ గులాబీ పూవు అందించింది. దీంతో అక్కడున్న వారితో పాటు వీడియో చూస్తున్న వారందరూ షాక్‌కు గురవుతున్నారు.
రొమాంటిక్‌గా చెప్పడంతో ఫ్లాట్ అయిపోయాడు
ఓ విషయం గురించి వర్షిణిపై శేఖర్ మాస్టర్ అలిగాడు. తనపై అలకను పోగొట్టడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. దేనికీ ఆయన సంతృప్తి చెందకపోవడంతో ఏకంగా ‘ఐ లవ్ యూ' అంటూ చెప్పేసింది. అంతేకాదు, పక్కనే ఉన్న ప్రియమణి చేతిలో ఉన్న పూలను తీసుకుని అతడికి అందించింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.