Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హైపర్ ఆదితో హాట్ యాంకర్ పెళ్లి.. ‘బావా.. ఏడాదికల్లా ఆ ఇంట్లో ఉంటా’మంటూ షాకింగ్ కామెంట్స్.!
బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తుంటారు.. కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరైతే స్టార్లుగా వెలిగిపోతుంటారు. అలాంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టు.. తక్కువ వ్యవధిలోనే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ పర్సన్‌గా వెలుగొందుతున్నాడు. తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ యాంకర్‌తో అతడు జీవితం పంచుకోబోతున్నాడట. ఆ వివరాలు మీకోసం.!
ఆ పది నిమిషాలు.. వాళ్లకు కన్నుల పండుగ
జబర్ధస్త్ షోలో ఓ టీమ్ సభ్యుడిగా పరిచయం అయ్యాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే అతడి టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు టీమ్ లీడర్‌ను చేశారు. అంతే.. అప్పటి నుంచి ఆది వెనుదిరిగి చూడలేదు. పది నిమిషాల స్కిట్లో గుక్కతిప్పుకోకుండా పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. దీంతో చాలా మంది అతడి స్కిట్ల కోసమే వేచి చూసే పరిస్థితి ఏర్పడింది.
అక్కడ కూడా ట్రై చేశాడు.. పేరొచ్చిన ఫలితం లేదు
బుల్లితెరపై సక్సెస్ఫుల్ కెరీర్‌ను అనుభవిస్తున్న హైపర్ ఆది.. సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు. అదే సమయంలో డైలాగ్ రైటర్ గానూ పరిచయం అయ్యాడు. అల్లరి నరేష్ ఇటీవల నటించిన ‘మేడ మీద అబ్బాయి' అనే మూవీకి ఆదినే సంభాషణలు అందించాడు. అయితే, ఈ మూవీ అంతంగా ఆడలేదు.
జబర్ధస్త్‌తో పాటు ఆ షో సక్సెస్‌లోనూ ఆది పేరు
ఆది అంటే జబర్ధస్త్ షో మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. కానీ, అతడు తెర వెనుక నుంచి మరో షోను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. అదే.. ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'. అవును.. ఈ షో అంటే డ్యాన్స్‌లతో పాటు యాంకర్.. టీమ్ లీడర్ల మధ్య పంచ్ డైలాగులు కూడా గుర్తొస్తుంటాయి. వాటిని రాసేది ఆదినే అన్న విషయం చాలా మందికి తెలీదు.
నేరుగా ఎంట్రీ ఇచ్చిన ఆది.. యాంకర్‌తో రొమాన్స్
చాలా కాలం ‘ఢీ'షోకు స్క్రిప్ట్ రైటర్‌గానే పని చేసిన హైపర్ ఆది... కొద్ది రోజుల క్రితం అందులోకి టీమ్ లీడర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్ జోడీ సుడిగాలి సుధీర్, రష్మీ ఓ టీమ్‌ను లీడ్ చేస్తుండగా.. మరో టీమ్‌ను యాంకర్ వర్షిణితో కలిసి లీడ్ చేస్తున్నాడు ఆది. ఈ క్రమంలోనే తన సహచర హాట్ యాంకర్‌తో తరచూ రొమాన్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.
ఆమెతో లవ్ ట్రాక్.. అందరి ముందూ చెప్పాడు
హైపర్ ఆది.. జబర్ధస్త్ యాంకర్ అనసూయ వెంట పడుతున్నట్లు కలరింగ్ ఇస్తూ ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, అది ఆ షో స్కిట్లో భాగమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ‘ఢీ'లో మాత్రం అతడు.. యాంకర్ వర్షిణితో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలోనే ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతున్నాని చెప్పడం కలకలం రేపింది.
Recommended Video
ఆదితో హాట్ యాంకర్ పెళ్లి.. ఏడాదికల్లా ఆ ఇంట్లో..
‘ఢీ'లో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు వర్షిణి, హైపర్ ఆది. ఇక, తాజాగా వీళ్లిద్దరూ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. దీనికి కారణం.. వచ్చే వారం ఎపిసోడ్లో వర్షిణి.. ఆదిని ఉద్దేశిస్తూ.. ‘నిన్ను బావ అని పిలవాలనిపిస్తుంది. వచ్చే ఏడాదికల్లా మనం ఇల్లు, కారు కొనుక్కోవాలి' అని కామెంట్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.