హైపర్ ఆదితో రొమాన్స్, అఫైర్.. గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి
తెలుగు టెలివిజన్‌లో ఢీ డ్యాన్స్ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఆ షోను ఎంజాయ్ చేస్తారనే విషయంలో ఎలాంటి డౌట్లు పెట్టుకోనక్కర్లేదు. ఆ షో అంత పాపులర్ కావడానికి కారణం యాంకర్ ప్రదీప్, మెంటర్స్ సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, హైపర్ ఆది, వర్షిణిలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయతే ఈ షోలో హైపర్ ఆది, వర్షిణి కెమిస్ట్రీ కొత్తగా ఉండటంతో వారిద్దరిపై రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా వర్షిణి తమ మధ్య ఉన్న బంధంపై లైవ్ ఛాట్‌లో వివరణ ఇస్తూ..

బుల్లితెరపై హాట్ జంటగా
టెలివిజన్ రంగంలో హాట్ జంట ఎవరైనా ఉన్నారంటే సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్. వీరిద్దరు జంటగా ఉన్నా.. ఏదైరా షోలో పాల్గొన్న దానికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారిద్దరి మధ్య ఉంటే సమయస్పూర్తి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. కాబట్టే వారిద్దరి జంటకు బుల్లితెర మీద క్రేజ్ ఏర్పడింది.

ఆది, వర్షిణి మధ్య కెమిస్ట్రీ
ఇక రష్మీ, సుధీర్ జంట తర్వాత తాజాగా అంతకంటే గొప్పగా మీడియాలో నానుతున్న జోడి హైపర్ ఆది, వర్షిణి. ప్రస్తుతం ఢీ షోలో వారిద్దరి కాంబినేషన్ మరో లెవెల్ ఉంటుందనే ఆ షోకు ఉండే రేటింగ్‌ను బట్టి ఈజీగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలెట్ అవుతున్నది.

మా మధ్య అదేనంటూ ఆది క్లారిటీ
ఇలాంటి క్రమంలో హైపర్ ఆది, వర్షిణి మధ్య అఫైర్ ఉందనే రూమర్లు, గాసిప్స్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్యూలో హైపర్ ఆది ఇదే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఢీ షోలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది షో డిమాండ్ మేరకే. మరో టీమ్‌లో రష్మి, సుధీర్ ఉండటం వల్ల మేము వారికి పోటీగా మావైపు నుంచి కెమిస్ట్రీని పండిస్తున్నామని హైపర్ ఆది చెప్పారు.

మీకు ఆదితో అఫైర్ ఉందా?
ఇక తాజాగా లాక్‌డౌన్ సందర్భంగా వర్షిణి సౌందర్యరాజన్ లైవ్ చాటింగ్‌లో అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీకు హైపర్ ఆదికి మధ్య అఫైర్ ఉందా? మీరిద్దరు ప్రేమించుకొంటున్నారా? అనే ప్రశ్నను సంధించాడు. దానికి వర్షిణి సున్నితంగా స్పందించారు.

హైపర్ ఆదితో నాకు అలాంటి రిలేషన్
హైపర్ ఆది, నాకు మధ్య అలాంటి రిలేషన్ లేదు. షో డిమాండ్ చేయడంతోనే తెరమీద అలా కనిపిస్తున్నాం. వ్యక్తిగతంగా మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని వర్షిణి చెప్పారు. రష్మి, సుధీర్ జోడికి మంచి రెస్పాన్స్ ఉన్నందున్న మా టీమ్ కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కాలని ప్లాన్ చేశాం అని వర్షిణి చెప్పారు.
Recommended Video

వర్షిణి కెరీర్ గురించి
ప్రస్తుతం వర్షిణి పలు షోలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. కొన్ని సినిమా ఆఫర్లు కూడా వస్తుండటంతో అటువైపు కూడా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఆమె చేస్తున్న పటాస్, ఢీ లాంటి షోలకు మంచి రేటింగ్ ఉంది. ఇవియే కాకుండా ఈవెంట్లు, ఇతర ప్రొగ్రామ్స్‌తో బిజీగా ఉన్నారు .


Click it and Unblock the Notifications











