Varshini Sounderajan: హైపర్ ఆదితో యాంకర్ వర్షిణి పెళ్లి.. అమ్మతో మాట్లాడమంటూ క్లారిటీ!
వర్షిణి సౌందరాజన్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతోకాలంగా టీవీ షోలలో యాంకర్ గా ఆకట్టుకున్న ఈ బ్యూటిఫుల్ గ్లామర్ ట్రీట్ ద్వారా కూడా హైలెట్ అయింది. తన యాంకరింగ్, అందానికి యూత్ ఫిదా అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య వర్షిణి సౌందరరాజన్ పై బీభత్సమైన పెళ్లి పుకార్లు వచ్చాయి. హైపర్ ఆదితో లవ్ ట్రాక్ నడిపించిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైపర్ అదితో పెళ్లిపై తాజాగా వర్షిణి క్లారిటీ ఇచ్చేసింది.

ప్రచారకర్తగా: నటిగా పరిచయం కావడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకుంది. దీంతో అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని నేషనల్ బ్రాండ్లకు ప్రచారకర్తగా పని చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

మరికొన్నింట్లో: మోడల్‌గా సత్తా చాటుతున్న సమయంలోనే వర్షిణి సౌందరరాజన్ 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మరి కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అవేవి ఆమెకు పెద్ద విజయాన్ని అంతగా అందించలేకపోయాయి. అలాగే గుర్తింపు కూడా తీసుకురాలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది.

బుల్లితెరపైకి అలా: సినిమాలకు గ్యాప్ తీసుకున్న తర్వాత వర్షిణి సౌందరరాజన్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ తో మంచి బ్రేక్ తెచ్చుకుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా చేశాడు. అయితే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కు కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంటర్ అయింది.

కనిపించట్లేదు: బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సౌందరాజన్ 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది. అందులో భాగంగానే ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షోకు యాంకర్‌గా చేసింది. దీని తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు.

మరోసారి క్లారిటీ: ఇటీవల శాకుంతలం సినిమాలో మెరిసిన సౌందరరాజన్ మళ్లీ సినిమాలు చేయలేదు. ఇదిలా ఉంటే ఆ మధ్య హైపర్ ఆది, వర్షిణి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ ఇలా ఎన్నెన్నో రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ ఉట్టి మాటలే అని వర్షిణి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల మళ్లీ ఆ వార్తలు జోరందుకోవడంతో మరోసారి క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటి.

అలాంటి ఎమోజీలు: తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో వర్షిణి సౌందరరాజన్ క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఒకతను "హైపర్ ఆదితో పెళ్లి ఎప్పుడు?" అని అడిగాడు. దానికి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఉండే ఎమోజీలను సమాధానంగా తెలిపింది వర్షిణి సౌందరరాజన్. ఈ సమాధానంతో హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి ఏం జరగట్లేదని, అవన్ని వట్టి పుకార్లే అని మరోసారి క్లారిటీ వచ్చినట్లు అయింది.

అమ్మతో మాట్లాడు: ఇదే చాట్ సెషన్ లో మరో నెటిజన్ వర్షిణి సౌందరరాజన్ తో పెళ్లి చేసుకుందామని అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించింది ఈ బ్యూటిఫుల్ యాంకర్. పెళ్లి గురించి మా అమ్మతో మాట్లాడండి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ చాట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలా మరోసారి పెళ్లి పుకార్లతో వర్షిణి సౌందరరాజన్ హైలెట్ అయింది.


Click it and Unblock the Notifications











