For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షోపై బాగానే ఆశలు పెట్టుకున్నట్టుందే.. రచ్చ చేసేందుకు యాంకర్ వర్షిణి రెడీ

    |

    బుల్లితెరపై ఇప్పుడు ఎన్ని షోలు పోటీగా ప్రారంభమవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు అయితే ఏ చానెల్‌లో పని చేస్తే వారు అక్కడే ఉండాలి.. వేరే చానెల్‌ షోల్లో నటించకూడదనే నియమాలుండేవి. కానీ ఇప్పుడు అలాంటి హద్దులు ఎవ్వరూ పెట్టడం లేదు. అందుకే ఒక చానెల్‌లో అవకాశాలు కోల్పోవడంతో వెంటనే మరో చానెల్‌, మరో షోలోకి వెళ్తున్నారు. మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్ వర్షిణి రచ్చ చేసింది.

    ఢీ నుంచి అవుట్..

    ఢీ నుంచి అవుట్..

    ఢీ షోలో వర్షిణి ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.మొదట్లో అంతగా డ్యాన్స్ రాకపోయినా కూడా రాను రాను అందులో రాటు దేలిపోయింది. అయితే ఢీలో వర్షిణి మంచి పేరు తెచ్చుకుంది. హైపర్ ఆదితో జోడిగా వర్షిణి వల్ల ఢీ షోకి మైలేజ్ బాగానే వచ్చింది. కానీ కొత్తగా ప్రారంభమైన 13వ సీజన్‌లో వర్షిణిని తీసుకోలేదు.

    కారణాలు మాత్రం..

    కారణాలు మాత్రం..

    ఢీ పదమూడో సీజన్‌లో వర్షిణి లేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆమె రెమ్యూనరేషన్ పెంచమని అడిగిందంటూ ఓ రూమర్ బయటకు వచ్చింది.. కావాలనే మల్లెమాల ఉద్దేశ్యపూర్వకంగానే వర్షిణిని బయటకు పంపించిందని మరో టాక్ చక్కర్లు కొట్టింది. మొత్తానికి ఆమె స్థానంలో టిక్ టాక్ ఫేమ్ దీపిక పిల్లి వచ్చేసింది.

    ఖాళీగా ఉన్నా కూడా..

    ఖాళీగా ఉన్నా కూడా..

    అయితే మధ్యలో కొన్ని వారాలు వర్షిణి బుల్లితెరపై కనిపించలేదు. అలానే ఖాళీగా ఉంది. వర్షిణి ఎందుకు రావడం లేదు? మళ్లీ ఏదైనా షోలో కనిపించు అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసేశారు. ఆ సమయంలో వర్షిణికి అదిరిపోయే చాన్స్ వచ్చింది.

    కొత్త షోలో..

    కొత్త షోలో..

    బిగ్ బాస్ షో వల్ల జబర్దస్త్ అవకాశాన్ని కోల్పోయిన అవినాష్‌ను ముందు పెట్టి.. ఓ కామెడీ షోను స్టార్ మా ప్రారంభించింది. కామెడీ స్టార్స్ అంటూ రాబోతోన్న ఈ షోను రేపు గ్రాండ్‌గా ప్రారంభించబోతోన్నారు. ఇందులో వర్షిణికి హోస్ట్‌గా చాన్స్ ఇచ్చారు.

    Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
     ఆశలన్నీ కూడా..

    ఆశలన్నీ కూడా..

    అలా అక్కడ తిరస్కరణకు గురైన వర్షిణికి ఇలా వెంటనే చాన్స్ దొరకడం అది కూడా సోలో యాంకర్‌గా చాన్స్ రావడంతో వర్షిణి తన ఆశలన్నీ ఈ షో మీదే పెట్టుకుంది. ఈ షోలో భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉందంటూ వర్షిణి తాజాగా పోస్ట్ చేసింది. రేపు షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోందంటూ పోస్ట్ చేసింది. మరి ఈ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Anchor Varshini Sounderajan Hopes On Comedy Stars
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X