శృతి మించిన యాంకర్ వర్షిణి గ్లామర్ షో.. వింటర్‌లోనూ వేడి పుట్టించేలా!

చాలా కాలం పాటు తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు సందడి చేసేవారు. వాళ్లకు యమా పోటీ కూడా ఉండేది. కానీ, ఇప్పుడు ఇలాంటి వాళ్లంతా సినిమాల బాట పడుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వర్షిణి సౌందరాజన్‌దే. స్వతహాగా నటి అయిన ఆమె.. యాంకర్‌గా మారి ఎన్నో షోలను హోస్ట్ చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలనే చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ వర్షిణి తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

చందమామ కథలు చెప్పి
స్వతహాగా మోడల్ అయిన వర్షిణి సౌందరాజన్ ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి పేరు రాలేదు. దీంతో మూవీలకు గ్యాప్ ఇచ్చేసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌‌లో నటించి విజయాన్ని దక్కించుకుంది.

 Anchor Varshini Sounderajan Latest Fantastic Photo Goes Viral

బుల్లితెరపైకి... ఢీతో క్రేజ్
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్‌కు ప్లస్ కాలేదు. ఆ సమయంలోనే ఈ భామ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా పని చేసి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలను నడిపించింది.

 Anchor Varshini Sounderajan Latest Fantastic Photo Goes Viral

అక్కడ మాయమైందిగా
యాంకర్‌గా బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు తనదైన మార్కును చూపించిన వర్షిణి సౌందరాజన్.. 'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. అంతేకాదు, బుల్లితెరపై పెద్దగా వర్క్ చేయడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సుమంత్‌తో కలిసి 'మళ్లీ మొదలైంది'తో సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టేసింది.

 Anchor Varshini Sounderajan Latest Fantastic Photo Goes Viral

వరుస సినిమాలతో బిజీ
బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి సినిమా రంగంపైనే ఫోకస్ చేసిన యాంకర్ వర్షిణి సౌందరాజన్.. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో వచ్చిన 'శాకుంతలం'లో నటించింది. ఇందులో కీలక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తనదైన రీతిలో మెప్పించింది. అలాగే, ఇప్పుడు వర్షిణి చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. టీవీలో కొన్ని షోలలోనూ కనిపిస్తూనే ఉంటోంది.

 Anchor Varshini Sounderajan Latest Fantastic Photo Goes Viral

సోషల్ మీడియాలోనూ
మోడల్‌గా, యాంకర్‌గా, హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలంగా గ్లామర్ ఫీల్డులో సందడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

గ్లామర్ షోతో కాక రేపేలా
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. చాలా మంది భామల్లా కాకుండా ఎక్కువగా హాట్ షోలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అయితే, వాటిలో ఎక్కువగా సీక్రెట్ అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా వర్షిణి ఈ మధ్య కాలంలో మరింత హైలైట్ అవుతూ వెళ్తోంది.

వర్షిణి హాట్ పిక్ వైరల్
యాంకర్ కమ్ యాక్ట్రెస్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ విప్పేసి అర్ధనగ్నంగా హాట్ షో చేసింది. అందులోనూ వేడి పుట్టించేలా ఘాటు ఫోజిచ్చింది. దీంతో ఈ యాంకరమ్మ అందాలు కొరకొరగా కనిపిస్తూ రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వర్షిణి ఫొటోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X