జాకెట్ వేసుకోకుండానే యాంకర్ వర్షిణి షో: సమంత అలా చేయడం వల్లే అంటూ!
అదిరిపోయే అందంతో ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది తెలుగు అమ్మాయిలు బుల్లితెరపైనో, వెండితెరపైనో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు.
చాలా కాలం క్రితమే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. మధ్యలో యాంకర్‌గా సందడి చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోనూ హడావిడి చేస్తోంది. తద్వారా బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే వర్షిణి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

చందమామ కథలతో వచ్చి: వర్షిణి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఆ సమయంలోనే 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి గుర్తింపు రాలేదు. దీంతో మూవీలకు గ్యాప్ ఇచ్చేసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌లో కొన్ని సీజన్లు చేసి విజయం సాధించింది.
టీవీ షోల్లో.. యాంకర్‌గానూ: నటిగా మారిన తర్వాత చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్‌కు కలిసి రాలేదు. ఆ సమయంలోనే ఈ భామ బుల్లితెరపైకి ఎంటరైంది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా తెగ నవ్వించింది. దీంతో ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా ఎంటరైంది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలు నడిపించింది.

బుల్లితెరకు గ్యాప్ ఇచ్చేసి: యాంకర్‌గా బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు తనదైన మార్కును చూపించిన వర్షిణి సౌందరాజన్.. 'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. అంతేకాదు, బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే సుమంత్‌తో కలిసి 'మళ్లీ మొదలైంది'లో లీడ్ రోల్ సహా పలు చిత్రాల్లోనూ నటించింది.
వరుసగా సినిమాలు చేస్తూ: కొంత కాలంగా సినిమాలు మాత్రమే చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. తాజాగా సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో వచ్చిన 'శాకుంతలం'లో నటించింది. ఇందులో కీలక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తనదైన రీతిలో మెప్పించింది. అలాగే, ఇప్పుడు వర్షిణి చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లకూ సంతకం చేసేసింది.

సోషల్ మీడియాలో బిజీగా: మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టినా.. ఆ తర్వాత యాంకర్‌గా, హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా విపరీతంగా సందడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది.
గ్లామర్ షోలో గీత దాటేస్తూ: సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. చాలా మంది భామల్లా కాకుండా ఎక్కువగా హాట్ షో కూడా చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఎద అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా ఈ చిన్నది గ్లామర్ షో చేస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.
జాకెట్ లేకుండానే వర్షిణి: యాంకర్ కమ్ యాక్ట్రెస్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ లేకుండానే చీరను కట్టుకుని కనిపించింది. పైగా కొన్నింటిలో మేకప్ కూడా లేకుండా ఫోజులిచ్చింది. అంతేకాదు, ఇవన్నీ శాకుంతలం సినిమాలో స్టిల్స్ అని.. తనకు సపోర్ట్ చేసిన సమంతకు థ్యాంక్స్ అని వర్షిణి ఈ పోస్టులో పేర్కొంది.


Click it and Unblock the Notifications











