యాంకర్ వర్షిణితో క్రికెటర్ ప్రేమాయణం.. అడ్డంగా బుక్ చేసిన ఫొటో.. జట్టు నుంచి బయటకు

వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేనిపేరు. ఎందుకంటే అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా తనదైన అందం, యాంకరింగ్ తో ఆకట్టుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మను ఓ క్రికెటర్ ప్రేమించాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా వీరి ప్రేమ కారణంగా సదరు క్రికెటర్ ను జట్టు నుంచి తొలగించినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

జాతీయ బ్రాండ్లకు:

నటిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ సుందరి అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Anchor Varshini Sounderajan Love Track With Washington Sundar And Team Serious

పెళ్లి గోల సిరీస్:మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ వర్షిణి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అవేవి ఆమెకు భారీ సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి మంచి బ్రేక్‌ను దక్కించుకుంది.

బుల్లితెర షోలు:సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కు కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె యాంకరింగ్ వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది. అలాగే కామెడీ స్టార్స్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరించింది.

Anchor Varshini Sounderajan Love Track With Washington Sundar And Team Serious

సుందర్ తో లవ్ ట్రాక్:కామెడీ స్టార్స్ షో తర్వాత వర్షిణి బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటించిన 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలతో కూడా వర్షిణికి ఒరిగింది ఏం లేదు. అయితే క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో వర్షిణి ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

Anchor Varshini Sounderajan Love Track With Washington Sundar And Team Serious

అలా హైలెట్:అంతేకాకుండా వర్షిణి, సుందర్ ఇద్దరు కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే అప్పట్లో బెంగళూరుకి ఆడిన సుందర్ ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్ కు హైదరాబాద్ లోనే ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతను చెప్పుకోదగ్గ పేరు అయితే తెచ్చుకోలేదు. కానీ వర్షిణి ప్రేమాయణంతో హైలెట్ అయ్యాడు.

Anchor Varshini Sounderajan Love Track With Washington Sundar And Team Serious

జట్టు నుంచి బయటకు:ఇదిలా ఉంటే తాజాగా వాషింగ్టన్ సుందర్ పై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిందట. రూల్స్ బ్రేక్ చేసి మరి యాంకర్ వర్షిణితో తిరగడంపై అసహనం వ్యక్తం చేసిందట. ఆమెతో రిలేషన్ కారణంగానే సుందర్ ను జట్టు నుంచి కూడా బయటకు పంపిచినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లు ఆడిన సుందర్ గాయం కారణంగా తప్పుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X