Anchor Varshini పచ్చిగా రెచ్చిపోయిన వర్షిణి: అలాంటి బట్టలతో కెమెరా ముందే.. సారీ చెప్పి తీసుకెళ్లిన రష్మీ
తెలుగు బుల్లితెరపై చాలా మంది అమ్మాయిలు యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్నారు. ఇందులో అద్భుతమైన టైమింగ్‌తో పాటు అందాలతో వల వేస్తూ సత్తా చాటుతున్నారు. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారిలో యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. మోడల్‌గా వచ్చి యాంకర్‌గా స్థిరపడిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస షోలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో యాంకర్ రష్మీ గౌతమ్‌తో ఓంకార్ సిక్త్స్ సెన్స్ సీజన్ 4లో పాల్గొంది. ఇందులో వర్షిణి హాట్ డ్యాన్స్‌తో రచ్చ చేసింది. ఆ సంగతులు మీకోసం!

మోడలింగ్ రంగంలో హవా చూపించి
వర్షిణి సౌందరాజన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ మెప్పించిన ఈ సుందరాంగి.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును కూడా అందుకుంది.

టాలీవుడ్ ఎంట్రీ.. బ్రేక్ మాత్రం దానితో
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు. దీంతో సినిమాలకు దూరమైపోయింది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది. ఇందులో అభిజీత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

బుల్లితెరపై ఎంట్రీ.. వరుస అవకాశాలు
సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత వర్షిణి సౌందరాజన్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. 'ఢీ' షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత 'పటాస్' సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. ఇక, ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో హోస్టుగా చేస్తూ తన సత్తాను నిరూపించుకుంటోంది

యాంకర్ రష్మీతో కలిసి ఓంకార్ షోలోకి
వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న వర్షిణి సౌందరాజన్.. మరో యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న సిక్త్స్ సెన్స్ సీజన్ 4లో పాల్గొంది. ఓంకార్ నిర్వహించే ఈ కార్యక్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ఓంకార్ కూడా రష్మీపై హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఓ కవితను కూడా చదివాడు. దీంతో ఇది రొమాంటిక్‌గా ప్రారంభమైంది.
ఇంకా తగ్గించుకోవాలా అంటూ డ్రెస్‌పై
సిక్త్స్ సెన్స్ సీజన్ 4 ప్రోమోలో ఓంకార్ కవిత తర్వాత రష్మీ మాస్ డ్యాన్స్ వేసింది. దీంతో ఆమెకు గేమ్‌లో ఓ క్లూ ఇస్తాడు. దాన్ని రష్మీ నమ్ముతుంది. అప్పుడు వర్షిణి 'ఏంటే నమ్ముతున్నావా? ఇది ఆయన షో' అంటుంది. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో 'అదే తగ్గించుకుంటే మంచిది' అనే డైలాగ్ వస్తుంది. దీనికి 'తగ్గించుకునే వచ్చా.. ఇంకేం తగ్గించాలి' అని తన డ్రెస్‌పై తానే పంచ్ వేసుకుంటుంది.
Recommended Video

హాట్ డ్యాన్సుతో రచ్చ.. రష్మీ రావడంతో
రష్మీతో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన యాంకర్ వర్షిణి సౌందరాజన్.. ఆ తర్వాత ఆమె ఆపేసినా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు, స్టేజ్ ముందు ఉన్న కెమెరా దగ్గరకు వచ్చి మరీ హాట్ హాట్‌గా డ్యాన్స్ చేస్తోంది. అసలే బుల్లి ష్కర్టు వేసుకున్న ఈ బ్యూటీ అలా ఎగురుతుంటే కెమెరా మొత్తం ఆమె మీదే ఫోకస్ అయింది. దీంతో రష్మీ వచ్చి ఆమెను లాక్కుని వెళ్లిపోయింది.


Click it and Unblock the Notifications











