For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!

  |

  మిగిలిన రంగాలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై యాంకర్లకు పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇందులో తమ సత్తాను నిరూపించుకోవాలని చాలా మంది భామలు విపరీతంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు మాత్రం మంచి పేరు తెచ్చుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అందులో యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈమె హోస్ట్ చేసింది చాలా తక్కువ షోలే అయినా.. ఇమేజ్‌ మాత్రం భారీ స్థాయిలో దక్కింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వర్షిణి.. టెలివిజన్ స్టార్‌తో నైట్ పార్టీ చేసుకుంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  అక్కడే ఫేమస్ అయిన వర్షిణి

  అక్కడే ఫేమస్ అయిన వర్షిణి

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మోడల్‌గా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.

  దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!

  సినిమాల్లో నిరాశ... అదే హిట్

  సినిమాల్లో నిరాశ... అదే హిట్

  మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి కెరీర్‌లో తొలి విజయాన్ని దక్కించుకుంది.

  యాంకర్‌గా ఎంట్రీ.. ఫుల్ క్రేజ్

  యాంకర్‌గా ఎంట్రీ.. ఫుల్ క్రేజ్

  వర్షిణి సౌందరాజన్ ఆరంభంలోనే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'ఢీ'లో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసినప్పుడు ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్', 'కామెడీ స్టార్స్' సహా ఎన్నో కార్యక్రమాలను హోస్ట్ చేసేసింది.

  మళ్లీ రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: షర్ట్ విప్పేసి మరీ ఎద అందాల ప్రదర్శన

  సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా

  సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా

  బుల్లితెరపై చాలా కాలం పాటు సందడి చేసిన వర్షిణి సౌందరాజన్.. కొంత కాలంగా పెద్దగా షోలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా 'కామెడీ స్టార్స్' షో తర్వాత ఆమె గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. వీటిలో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ భాగం అవుతూ ఫుల్ బిజీగా మారిపోయింది.

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సోషల్ మీడియాలో యాక్టివ్

  ఒకవైపు బుల్లితెరపై యాంకర్‌గా.. మరోవైపు వెండితెరపై నటిగా సత్తా చాటుతోన్న వర్షిణి సౌందరాజన్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుటోంది.

  ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్

  అతడితో వర్షణి నైట్ పార్టీలో

  అతడితో వర్షణి నైట్ పార్టీలో

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ వర్షిణి సౌందరాజన్.. తన పర్సనల్ విషయాలను సైతం పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో కలిసి తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె.. అతడికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తుంది. అలాగే, అతడిని గట్టిగా హత్తుకుని యమ రచ్చ రచ్చ చేసేసింది.

  నువ్వే నాకు రైట్‌ రా అంటూ

  నువ్వే నాకు రైట్‌ రా అంటూ


  హైపర్ ఆది పుట్టినరోజుకు సంబంధించిన సెలెబ్రేషన్ వీడియోను షేర్ చేసిన వర్షిణి సౌందరాజన్ 'బర్త్‌డే సెలెబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆది నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. నా మంచి కోరే నా స్నేహితుడు. రైటర్ ఆది.. నువ్వే నాకు రైట్‌రా ఆది' అని రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shares Hyper Aadi Birthday Party Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X