బిగ్‌బాస్ 4లో యాంకర్ వర్షిణి.. గత సీజన్స్‌లోనే వెళ్లాల్సింది.. అందుకే వెళ్లలేదంటూ క్లారిటీ

ప్రపంచంలోనే అతి పెద్ద రియాల్టీ షో.. బిగ్ బాస్. వివిద దేశాల్లో వివిద రకాల పేర్లతో పిలిచినా.. కాన్సెప్ట్ మాత్రం ఒకటే. అందరి ఓ ఇంట్లోకి చేర్చడం, పరిమిత వనరులతో బతికేలా చేయడం, మధ్య మధ్యలో టాస్క్‌ల పేరటి వారిలో దాగి ఉన్న కోణాలను బయటకు తీయడమే బిగ్‌బాస్ ఉద్దేశ్యం. ప్రస్తుతం బిగ్‌బాస్ షో అనేది ఇండియాలో బుల్లితెరపై అతి పెద్ద విజయం సాధించిన రియాల్టీ షో. ఇప్పటికే హిందీలో పదమూడు సీజన్స్ పూర్తి చేసుకోగా.. తమిళ, తెలుగు భాషల్లో మూడు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక నాల్గో సీజన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Bigg Boss Telugu 4 : Anchor Varshini In Season 4
గ్రాండ్ సక్సెస్..

గ్రాండ్ సక్సెస్..

తెలుగులో బిగ్ బాస్ షో అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. మూడు సీజన్స్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. ఎన్టీఆర్ మొదటి సీజన్‌ను , నాని రెండో సీజన్‌ను, నాగార్జున్ మూడో సీజన్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇక నాలుగో సీజన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు టాక్.

హోస్ట్‌గా నాగార్జుననే

హోస్ట్‌గా నాగార్జుననే

తెలుగు బిగ్ బాస్‌లోనే ఓ కొత్త పోకడకు లేవనెత్తింది. మిగతా భాషల్లో ఒకే హోస్ట్ అన్ని సీజన్స్‌ను నడిపిస్తూ ఉండగా తెలుగులో మాత్రం మారుతూ వస్తున్నారు. ఈ క్రమంలో నాల్గో సీజన్‌కు కూడా మార్పు ఉంటుందని అంతా భావించారు. అయితే అందులో ఎలాంటి మార్పుండటం లేదని తెలుస్తోంది. కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయబోతోన్నాడు.

 ఇప్పటికే ఓ లిస్ట్ లీక్..

ఇప్పటికే ఓ లిస్ట్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రధానంగా పరిశీలనలో ఉన్నవారిలో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్ పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరితో చర్చలు పూర్తయ్యాయని, వారికి సంబంధించిన రెమ్యునరేషన్ల విషయంపై రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనేది తెలిసింది.

రేసులో వర్షిణి..

రేసులో వర్షిణి..

ప్రతీసారి ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలెబ్రిటీని తీసుకొచ్చే బిగ్ బాస్ బృందం ఈ సారీ అలాంటి పద్దతినే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమ్రంలో యాంకర్ కేటగిరీ లిస్ట్‌లో వర్షిణి సౌందరరాజన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

గత సీజన్స్‌లోనే..

గత సీజన్స్‌లోనే..

తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీపై ఆమె క్లారిటీ ఇస్తూ.. నిజానికి తాను సీజన్ 2, సీజన్ 3లలో రావాల్సి ఉందని, బిగ్ బాస్ నిర్వాహకులు తనతో చర్చించారని చెప్పారు. తాను అప్పటికే కొన్ని షోలు చేస్తుండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదని తెలిపింది. అందుకే వెళ్లలేకపోయానని పేర్కొంది. అయితే నాల్గో సీజన్‌కు సంప్రదిస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X