Anchor Vishnupriya: అన్ ఫాలో చేయమని విష్ణుప్రియ రిక్వెస్ట్.. పెరుగుతున్న ఫాలోవర్స్, కారణం?

ముందుగా సినిమాల్లో పరిచయమై తర్వాత యాంకర్ గా మారిన విష్ణుప్రియ భీమనేని గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. జబర్దస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ యాంకర్. అయితే ఇటీవల ఆమె ఫైస్ బుక్ అకౌంట్ లో ఫాలోవర్స్ మిలియన్న కొద్ది తెగ పెరిగిపోతున్నారు. అందుకు గల కారణాల వివరాళ్లోకి వెళితే..

 హాట్ షోతో రెచ్చిపోయిన యాంకర్..

హాట్ షోతో రెచ్చిపోయిన యాంకర్..

యాంకర్ విష్ణుప్రియ యుక్త వయసులో ఉన్నప్పుుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. మోడలింగ్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమా అప్పుడు విడుదల కాలేదు. ఇదే సినిమా గతేడాది ఓటీటీలో నేరుగా విడుదలైంది. ఇక ఈ మూవీలో విష్ణుప్రియ హాట్ షో అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షోతోపాటు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది ఈ భామ. అంతేకాకుండా బికినీలో దర్శనమిచ్చి యూత్ కు మతిపోగోట్టింది. ఆ తర్వాత యాంకర్ గా మారిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో తెగ సందడి చేస్తోంది.

విష్ణుప్రియ క్షమాపణలు..

విష్ణుప్రియ క్షమాపణలు..

హాట్ ఫొటోలు, వీడియోలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఖాతాలో అశ్లీల చిత్రాలు, వీడియోలు, అసభ్యకర రీల్స్ ఎన్నో దర్శనమిచ్చాయి. ఆమె పేజీలో, స్టోరీలో ఈ వీడియోలు చూసి ఒక్కసారి షాక్ అయిన విష్ణు ప్రియ స్నేహితులు ఆమెకు తెలిపారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ కు, ఎఫ్ బీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. తన అకౌంట్ హ్యాక్ అయిందని.. వెంటనే ఆ పేజ్ ని అన్ ఫాలో చేయమని ఇన్ స్టా గ్రామ్ ద్వారా వీడియో రూపంలో అభ్యర్థించింది. తన పేజ్ లో అలాంటి పోస్ట్ లు వచ్చినందుకు క్షమాపణలు కూడా తెలిపింది.

 పెరిగిన ఫాలోవర్లు..

పెరిగిన ఫాలోవర్లు..

అయితే విష్ణు ప్రియ ఫేస్ బుక్ లో అశ్లీల చిత్రాల దర్శనం మాత్రం ఆగట్లేదు. ఫేస్ బుక్ టీమ్ కు రిక్వెస్ట్ చేసినా, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినా హ్యాకర్ ఆగడాలు ఆగట్లేదు. ఇప్పటికీ నీలి చిత్రాలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో యాంకర్ విష్ణుప్రియ ఫాలోవర్స్ తెగ పెరిగిపోతున్నారు. అందుకు కారణం ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ఈ నీలి చిత్రాలు దర్శనం ఇవ్వడమే. ప్రస్తుతం ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తమ అకౌంట్ హ్యాక్ అయిందని, పేజ్ ని అన్ ఫాలో అవ్వమని విష్ణుప్రియ చెబుతుంటే కొందరు నెటిజన్లు మాత్రం ఆమెనే తప్పుబడుతున్నారు. రోజు బూతు వీడియోలు పెడుతున్నావ్.. టాలెంట్ చూపిస్తున్నావా.. లేదంటే నువ్వే కావాలని హ్యాక్ చేయించుకుని ఇలా చేస్తున్నావా అని నోరుపోరేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X