అమ్మో ఏంటి ఈ దారుణం.. స్టెప్పులతో దడపుట్టించిన ముమైత్ ఖాన్-విష్ణుప్రియ
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పోకిరి సినిమా, ఆ సినిమాలో ఈ ఐటెం సాంగ్.. అందులో అద్భుతంగా డ్యాన్స్ చేసిన ముమైత్ ఖాన్ ఎప్పటికీ ట్రెండ్ సెట్టరే. ఈ చిత్రం తరువాత ముమైత్ ఖాన్ రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. అయితే ఆ తరువాత ముమైతే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది. కానీ ముమైత్ ఖాన్ మాత్రం ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది.

అప్పుడు లాలా..
బిగ్ బాస్ మొదటి సీజన్‌లో ముమైత్ ఖాన్ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆ షో వల్ల ముమైత్ ఖాన్‌కు ఎటువంటి ఉపయోగం రాలేదు. బిగ్ బాస్ వల్ల ముమైత్ ఖాన్ ఇమేజ్‌లో కాస్త మార్పు వచ్చింది. ఐటెం గర్ల్ అనే ముద్ర నుంచి ముమైత్ తప్పించుకుంది. కానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు.

మధ్యలో వివాదాలు..
ముమైత్ ఖాన్ చుట్టూ ఎక్కువగా వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఆ మధ్య డ్రగ్స్ కేసులు, కొన్ని రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్‌కు డబ్బులు చెల్లింపు విషయంలో ముమైత్ ఖాన్ వివాదంగా మారింది. అలా చాలా రోజుల తరువాత వివాదాలతో వార్తల్లోకి ఎక్కింది.

ఇప్పుడు ఇలా..
అయితే ముమైత్ ఖాన్ మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెను డ్యాన్స్ ప్లస్ షోలో ఓ జడ్జ్‌గా తీసుకున్నాడు ఓంకార్. కాంట్రవర్సీ, గ్లామర్ ఇలా అన్ని ఉంటాయన్న ఉద్దేశ్యంలో ముమైత్ ఖాన్‌ను తీసుకొచ్చినట్టున్నాడు ఓంకార్. అయితే ఇప్పుడు అది నిజమవుతోంది.

విష్ణుప్రియ డ్యాన్స్..
శనివారం నాటి ఎపిసోడ్‌లో విష్ణుప్రియ అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. విష్ణుప్రియ ఊపిన అందాలకు అందరూ ఫిదా అయ్యారు. బాబా భాస్కర్, ఓంకార్ లాంటి వారు విష్ణుప్రియ నడుము మీద శ్రద్ద పెట్టారంటూ ఆమె ఏ రేంజ్‌లో దుమ్ములేపిందో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video

ముమైత్ ఖాన్ సైతం..
ఇక తన ముందు అలా ఊపితే.. నడుమును తిప్పితే ముమైత్ ఖాన్ ఊరికే ఉంటుందా? స్టేజ్ మీదకు ఎక్కేసి విష్ణుప్రియకు పోటీగా డ్యాన్స్ చేసింది. ముమైత్ స్టేజ్ మీదకు ఎక్కి డ్యాన్స్ చేయడంతో, నడుమును తిప్పే మూమెంట్స్ వేయడం, ఆమెను అనుకరిస్తూ విష్ణుప్రియ కూడా డ్యాన్సులు వేయడంతో అంత రచ్చ రచ్చగా మారింది. ఆ వీడియోలు ఇప్పుడు విష్ణుప్రియ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











