కమిట్మెంట్ పై విష్ణుప్రియ ఆవేదన.. డబ్బులిస్తే వస్తామని బేవర్స్‌గాళ్లు అలా చేస్తారంటూ

తెలుగు బుల్లి తెర ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ (anchor Vishnu Priya), ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిసిక్ టాక్ షో'లో పాల్గొంది. ఎప్పుడూ ఉత్సాహంగా, జోష్‌తో కనిపించే విష్ణుప్రియ ఈసారి తన జీవితంలోని అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ టాక్ షోలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జర్నీ, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సవాళ్లు, అదృష్టం (Luck), ప్రతిభ (Talent) మధ్య తేడా, అలాగే కర్మ సిద్ధాంతంపై తన విశ్వాసం గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

మొదటగా 'ఇండస్ట్రీలోని కమిట్మెంట్' అనే సున్నితమైన అంశం గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ షాకింగ్ రివిలేషన్స్ చేసింది. "నేను ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టినప్పుడు కొంతమంది నన్ను హెచ్చరించారు. ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని, లేకపోతే అవకాశాలు రావని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే నాకు చాలా భయం వేసింది. అందుకే నేను ఇండస్ట్రీని వదిలేసి వెనక్కి వెళ్లిపోయాను," అని చెప్పింది. ఆ సమయంలో తనకు ఉన్న భయం, అస్థిరత, అనుభవం లేకపోవడం వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

Anchor Vishnu Priya Opens Up About Commitment Culture and Luck in the Industry

అయితే కొంత కాలం తర్వాత తన జీవితంలో కొత్త మార్పు చోటుచేసుకుందని ఆమె తెలిపింది. "తర్వాత మల్లెమాల ఎంటర్‌టైనర్స్ వాళ్లు ఆడిషన్స్ నిర్వహించారు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ సంస్థతో కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. అక్కడ పని చేసినంత కాలం ఎవరూ ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. కనీసం నా ఒంటిమీద వేలు పెట్టే పరిస్థితి కూడా రాలేదు. వాళ్ల లాంటి సంస్థలు ఇండస్ట్రీలో చాలా అరుదు. ఆ సంస్థ వల్లే నాకు పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది," అని గుర్తుచేసుకుంది.

తన కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేస్తూ.. "మధ్యలో కొంతమంది బేవర్స్ గాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారు. మనల్ని చూసి డబ్బుకోసం ఏదైనా చేస్తారు అనుకునే వారు కూడా ఉండేవారు. కానీ నేను ఎప్పుడూ అలాంటి విషయాలను పట్టించుకోలేదు. నా పని నా విధంగా చేసుకున్నా. నా గురించి ఎవరేమైనా అనుకున్నా, నేను ఏం చేయాలో నాకు తెలుసు," అంటూ తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని వ్యక్తపరిచింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టబోయే కొత్త యువతీ యువకులకు ఆమె ఇచ్చిన సలహా మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉంది. "కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్లు కేవలం అందం, అభినయం మాత్రమే కాకుండా కొంత లక్క్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ అందరి కలిసిరాదు. ముందు మీ జాతకంలో స్టార్ అవుతారని రాసి ఉంటేనే ఈ రంగంలో నిలదొక్కుకోగలరు. ఎందుకంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలి," అని స్పష్టంగా చెప్పింది.

తనపై ఉదాహరణ చూపిస్తూ "నేను అంత అందంగా ఉండా, టాలెంట్ కూడా కొంచెం ఉంది, డ్యాన్స్ వస్తుంది, యాంకరింగ్ కూడా ఓకే. ఇవన్నీ కలిపి నేను సక్సెస్ అయ్యా. ఎందుకంటే నా జాతకంలో రాసి ఉంది. అందుకే లక్ కూడా చాలా ముఖ్యం," అని ఫన్నీగా కామెంట్ చేసింది. దీంతో యాంకర్ వర్ష "నువ్వు టాలెంట్ నమ్ముతావా? లేక లక్ నమ్ముతావా?" అని అడగగా విష్ణుప్రియ ఆ ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది.

"మా అమ్మ నాకంటే 100 శాతం బెటర్ టాలెంట్ ఉన్నది. మా తాతగారు కూడా ఎన్నో సంవత్సరాలుగా నాటకాలు, డ్రామాలు చేసేవారు. వాళ్ల టాలెంట్ తో పోల్చితే నా టాలెంట్ ఒక్క శాతం కూడా కాదు. కానీ వాళ్లు పేరు సంపాదించలేదు. నేను మాత్రం ఈ స్థాయికి వచ్చాను. అందుకే టాలెంట్ మాత్రమే కాదు, లక్ కూడా మనతో ఉండాలి," అని ఆమె స్పష్టంగా చెప్పింది.

ఇక కర్మ సిద్ధాంతం (Law of Karma) గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ కొంత ఆధ్యాత్మికతతో మాట్లాడింది. "నేను కర్మను ఖచ్చితంగా నమ్ముతా. నువ్వు చేసే పనికి ఫలితం ఇప్పుడు రాకపోయినా, రేపో మాపో వస్తుంది. హార్డ్ వర్క్ ఎప్పుడూ వృథా కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. 'నీ పని నువ్వు చెయ్, ఫలితాన్ని ఆశించకు.' నేను కూడా అదే తత్వం పాటిస్తున్నా. మీరు చేసే మంచి పనికి ఫలితం ఎప్పుడో ఒకరోజు మీ తలుపు తడుతుంది," అంటూ స్పిరిచువల్ టోన్‌లో తన ఆలోచనలను పంచుకుంది.

మొత్తం మీద, విష్ణుప్రియ ఈ ఇంటర్వ్యూలో తన ఫన్నీ వైపు కాకుండా ఒక సీరియస్ వ్యక్తిత్వాన్ని చూపించింది. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సవాళ్లు, కమిట్మెంట్ కల్చర్‌పై ఆమె చేసిన స్పష్టమైన వ్యాఖ్యలు, టాలెంట్ కంటే లక్ కూడా అవసరమని చెప్పిన వాస్తవమైన విశ్లేషణ, అలాగే కర్మపై ఉన్న నమ్మకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన స్పష్టత, ధైర్యం, పాజిటివ్ ఎనర్జీతో విష్ణుప్రియ మరోసారి ప్రూవ్ చేసింది. టాలెంట్, హార్డ్‌వర్క్‌తో పాటు లక్ కూడా మన జీవితాన్ని మలుపు తిప్పగలదని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X