ఇప్పటికి మూడు సార్లు.. ఆ సమయంలో నేను కంట్రోల్ తప్పా..

Vishnu Priya : తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో యాంకర్ విష్ణుప్రియ అంటే తెలియని వారు లేరు. తన హాట్ లుక్స్, జోష్‌ఫుల్ యాంకరింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చల్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా యాంకర్ వర్ష హోస్టింగ్ చేస్తున్నా "కిసిక్ టాక్ షో"లో అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో తన వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాలను బహిరంగంగా పంచుకున్నారు. ప్రధానంగా లవ్ బ్రేకప్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విష్ణు ప్రియ జీవితంలో ఏం జరిగింది?

ఎప్పుడూ మోడర్న్ లుక్స్‌లో కనిపించే విష్ణుప్రియ ఈసారి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ వర్ష అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా, నిజాయితీగా సమాధానమిచ్చింది విష్ణుప్రియ. అయితే.. ఒక దశలో ఎమోషనల్‌గా మారారు. ముఖ్యంగా తన జీవితంలో జరిగిన లవ్ బ్రేకప్స్ , వాటి వల్ల తాను నేర్చుకున్న జీవిత పాఠాలు గురించి వెల్లడించింది.

Anchor Vishnu Priya Opens Up About Love Breakups and Emotional Healing in Kisik Talk Show

వర్ష "మీ జీవితంలో ఎప్పుడైనా లవ్ బ్రేకప్ జరిగిందా?" అని అడగగా, విష్ణుప్రియ "నా వయసు ఇప్పుడు 33 సంవత్సరాలు. ఇప్పటివరకు నాకు మూడు బ్రేకప్‌లు జరిగాయి. కానీ రెండో బ్రేకప్ మాత్రం నా జీవితంలో పెద్ద షాక్ లాంటిది. ఆ బాధను మర్చిపోవడానికి నాకు దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది," అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె మాట్లాడుతూ, "ఆ సమయంలో నేను మానసికంగా చాలా బలహీనంగా మారాను. ఆ బాధ నుంచి బయటపడటానికి కాశీ యాత్ర కూడా చేశాను. అక్కడి వాతావరణం, ఆధ్యాత్మిక శాంతి నన్ను కొత్తగా మలిచాయి. ఆ కఠిన సమయమే నాకు నన్ను నేను తిరిగి కనుగొనే అవకాశం ఇచ్చింది. ఆ బాధ నన్ను బలమైన వ్యక్తిగా మార్చింది" అని ఎమోషనల్‌గా చెప్పారు.

తరువాత యాంకర్ వర్ష "లవ్ ఫెయిల్యూర్ సమయంలో చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. మీరు ఎలా బయటపడ్డారు?" అని అడగగా విష్ణుప్రియ హార్ట్ టచ్చింగ్ సమాధానమిచ్చింది. "ఆ సమయంలో చాలా ఏడ్చాను. మనసు బరువుగా ఉండేది. అవతల వాళ్లు చేసిన తప్పుకి మనల్ని మనమే బాధపడతాం. అదే పెద్ద తప్పు. మన విలువను మనమే తెలుసుకోవాలి. ఆ సమయంలోనే నేను మెడిటేషన్ ప్రారంభించాను. మొదట్లో కష్టంగా అనిపించినా, క్రమంగా అది నా జీవితంలో భాగమైపోయింది. మెడిటేషన్ వలన మన శ్వాస మీద కంట్రోల్ వస్తుంది, మన ఆలోచనలు స్థిరపడతాయి. ఆలోచనల మీద నియంత్రణ పెరిగితే మనం బలంగా మారతాం" అని వివరించారు.

తన జీవితంలో మెడిటేషన్, యోగా ఎంత మార్పు తెచ్చాయో విష్ణుప్రియ వివరించింది. "ప్రతి రోజు కనీసం అరగంటైనా మెడిటేషన్ చేస్తాను. అది నాకు శాంతి, ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను ఎవరో, నాకు ఏమి కావాలో అర్థమయ్యింది. గతంలోని బాధలు ఇప్పుడు నాకు శక్తిగా అనిపిస్తున్నాయి. నిజంగా వెనక్కి చూసుకుంటే, నా బ్రేకప్‌లు నాకు శాపం కాదు, ఆశీర్వాదం. అవే నన్ను మెచ్యూర్‌గా, ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా మార్చాయి" అని చెప్పారు.

విష్ణుప్రియ మాటలు ప్రేక్షకుల గుండెలను తాకాయి. ఎప్పుడూ ఫన్నీ, గ్లామరస్ యాంకర్‌గా కనిపించే విష్ణు ప్రియ మనసులో ఇంతా బాధ ఉందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షోలో ఆమె చెప్పిన మాటలు వినే వారందరికీ ప్రేరణగా నిలిచాయి. "బ్రేకప్‌లు నన్ను కూలదీసే బదులు, నన్ను కొత్తగా మలిచాయి" అని చెప్పిన విష్ణుప్రియ మాటలు హార్ట్ టచ్చింగ్ మారాయి. మొత్తానికి విష్ణుప్రియ ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X