చచ్చే వరకు వాళ్లను ప్రేమిస్తునే ఉంటా.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి విష్ణుప్రియ షాకింగ్ కామెంట్లు!
యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈమె... ముందుగా యాంకర్ గా కొనసాగింది. పోవో పోరా వంటి షోలు చేస్తూ రచ్చ చేసిన ఈమె.. తాజాగా తన మాజీ ప్రియుల గురించి చెప్పుకొచ్చింది. వారిని తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని అందుకు కారణాలను కూడా వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జరీ జరీ పంచె కట్టి పాటలో మానస్ తో అదిరిపోయే స్టెప్పులు వేసి మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కూడా పని చేస్తుంటుంది. అనేక షార్ట్ ఫిల్మ్స్ తో పాటు అనేక టీవీ షోల్లోను కనిపించి సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం 37 ఏళ్ల వయసు కల్గిన ఈమె ప్రస్తుతం తన చెచ్లితో కలిసి ఉంటోంది. గతేడాదే ఈమె తల్లి చనిపోయిగా.. ఫుల్ డెప్రషన్ లోకి వెళ్లిపోయింది. కానీ దాన్నుంచి తేరుకుని తన చెల్లిలిని చూసుకుంటోంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే అనేక కామెంట్లు చేసి ఎవరూ ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి వివరించింది. గతంలో తనకు చాలా మందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని... అయితే వారితో తాను ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చింది. కేవలం టచ్ లో ఉండడమే కాదు... వారిని తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నట్లు చెప్పింది. తన ప్రాణం ఉన్నంత వరకు వారిని ప్రేమిస్తూనే ఉంటానని కూడా స్టేట్ మెంట్ పాస్ చేసింది.
అయితే వారిలో తనకు ఏదో ఒక క్వాలిటీ నచ్చే, ఇష్టపడే వారితో ప్రేమలో పడ్డానని... కానీ మిగతా విషయాల్లో తమ మధ్య సఖ్యత కుదరక బ్రేకప్ చెప్పుకున్నామని విష్ణుప్రియ తెలిపింది. అయితే తనకు నచ్చిన క్వాలిటీలు ఇప్పటికీ వాళ్లలో ఉన్నందు వల్ల వాళ్ల మీద తనకు ఇంకా ప్రేమ చావలేదని.. ఎప్పటికీ చావదని కూడా వెల్లడించింది. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా ఒక్కసారి కూడా తాను వాళ్లతో మాట్లాడకుండా ఉండలేదని క్లారిటీ ఇచ్చింది.

తన గురించి చాలా బాగా తెలిసిన తన ఎక్స్ బాయ్ ప్రెండ్సే తన కుటుంబ సభ్యులు అని.. వారు ఎప్పటికీ తను సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారని విష్ణుప్రియ స్పష్టం చేసింది. మేమంతా మంచి స్నేహితులం అని.... కలిసి ఒక కూర చేయలేకపోయిన మాత్రానా కొట్టుకు చావాల్సిన అవసరం లేదని, మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











