స్టార్ హీరోయిన్ల బాట పట్టిన యాంకర్ విష్ణుప్రియ.. మెడలో పూలదండ.. ఎందుకో తెలుసా?

ఈ మధ్య కాలంలో యాంకర్ లలో మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో విష్ణుప్రియ బీమనేని ఒకరు. ఈ గ్లామరస్ బ్యూటి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ది బ్రేకప్ కన్సల్టెంట్ వంటి తదితర చిన్న వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవి విడుదల కాలేదు. తర్వాత బుల్లితెరపై యాంకర్ గా రాణించింది. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్న విష్ణుప్రియ మెడలో దండతో ఊహించని విధంగా దర్శనం ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటనే వివరాల్లోకి వెళితే..

యాంకర్ కాకముందు పలు యూట్యూబ్ వెబ్ సిరీసులతో ఆకట్టుకున్న విష్ణు ప్రియ చెక్ మేట్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. కానీ, ఈ సినిమా అప్పుడు విడుదల కాలేదు. 2021లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో యాంకర్ విష్ణుప్రియ చేసిన హాట్ షో అంతా ఇంతా కాదు. ఘాటు గ్లామర్ షోతోపాటు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది. అంతేకాకుండా బికినీలో దర్శనమిచ్చి యూత్ కు మతిపోగోట్టింది. తర్వాత దగ్గుబాటి రానా హోస్ట్ గా చేసిన నెంబర్ వన్ యారీ టాక్ షోలో పనిచేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యాంకర్ గా పాపులర్ అయింది.

Anchor Vishnu Priya Tiring Magical Puja In Varanasi Pic Goes Viral

పోవే పోరా వంటి షోలతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ విష్ణుప్రియ తర్వాత వరుసగా సినీ అకాశాలు అందుకుంది. గతేడాది వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించి, అందాలను ఆరబోసింది. తర్వాత బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి జరీ జరీ పంచెకట్టు సాంగ్ లో ఆడిపాడి అలరించింది. ఇందులో మానస్ తో కలిసి విష్ణుప్రియ వేసిన స్టెప్పులు, పాటకు మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం గంగులు అనే మరో సాంగ్ వీడియో చేశారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి నటించిన దయ అనే వెబ్ సిరీసులో జర్నలిస్టుగా కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సిరీస్ ఆగస్టు 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.

Anchor Vishnu Priya Tiring Magical Puja In Varanasi Pic Goes Viral

సోషల్ మీడియాలో బీచ్ లో తిరుగుతూ అందాలను వడ్డించే యాంకర్ విష్ణు ప్రియ ఆధ్యాత్మిక బాట పట్టింది. యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణుప్రియ వైట్ చుడీదార్ వేసుకుని మెడలో పూలదండలతో కనిపిచింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలో వారణాసిలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలిపింది. కాశీలో ఈశ్వరుడి కటాక్షం కోసమే అలా పూజులు చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకు కెరీర్ సక్సెస్ కోసం రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే విష్ణు ప్రియ వస్త్రధారణ కొంచెం.. ఇషా ఫౌండేషన్ లో సమంత కనిపించినట్లుగా ఉంది. ప్రస్తుతం విష్ణు ప్రియ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X