మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. గ్లామర్, పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో అవకాశాలను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఇందులో భాగంగానే విష్ణుప్రియ తాజాగా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. మరి దానిని మీరు కూడా చూసేయండి మరి!

టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ
ఇంటర్ చదువుతోన్న రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మోడల్‌గా సందడి.. రానా షోలో
హీరోయిన్‌గా చేసిన తర్వాత చాలా కాలం పాటు విష్ణుప్రియ భీమనేని యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. తర్వాత కొన్నేళ్లకు మోడల్‌గా మారి అక్కడా సక్సెస్ అయింది. అలాగే, ఎన్నో బ్రాండ్‌కు ఎండార్స్ చేసింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. అలా చాలా కార్యక్రమాలకు తెర వెనుక భాగమైంది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టిలో పడింది.

యాంకర్‌గా మారి.. ఆ షోతో క్రేజ్
అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది. అలాగే, సుధీర్‌తో విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ఆమె ఖండించింది.

బుల్లితెరకు దూరమైన బ్యూటీ
చాలా తక్కువ సమయంలో బుల్లితెరపై ఊహించని రీతిలో పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఈ మధ్య ఆమె షోలను హోస్టింగ్ చేయడం లేదు. గతంలో ఆమె నడిపిన షోలు లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయాయి. అప్పటి నుంచి ఈ బ్యూటీ బుల్లితెరకు దూరమైంది. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వచ్చి గ్యాప్‌ను కవర్ చేసేలా అలరిస్తూనే ఉంటోంది.
సోషల్ మీడియాలో సందడిగా
చాలా కాలం పాటు వరుసగా షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తద్వారా తరచూ తెగ హైలైట్ అవుతోంది.
అందాలను ఆరబోస్తూ రచ్చ
యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఆమె ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తోంది.

డ్యాన్స్ వీడియోతో షాకిచ్చింది
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న విష్ణుప్రియ భీమనేని.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను వదిలింది. ఇందులో ఆమె నలుపు రంగు చీరను కట్టుకుని అందాల ప్రదర్శన చేస్తూ డ్యాన్స్ చేసింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











