మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది యాంకర్లుగా స్థిరపడిపోయారు. వీళ్లలోనూ చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. అందంతో పాటు పర్‌ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుని దూసుకుపోయింది. ఇక, ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయని విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. మరి దానిపై మీరూ రెండు కళ్లేయండి!

చిన్న వయసులోనే ప్రవేశం
విష్ణుప్రియ భీమనేని చిన్న వయసులోనే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా విడుదలైంది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ షాకిచ్చింది. అలాగే బికినీలోనూ కనిపించింది. ఫలితంగా విష్ణుప్రియ నటించిన ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది.

యాంకర్‌గా... అది సక్సెస్‌గా
సినిమాలో నటించిన తర్వాత చాలా ఏళ్ల పాటు యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన విష్ణుప్రియ.. కొన్నేళ్లకు మోడల్‌గా మారింది. ఈ క్రమంలోనే అక్కడ సక్సెస్ అయింది. అలాగే, ఎన్నో బ్రాండ్‌కు ఎండార్స్ చేసింది. అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి చాలా షోలలో చేసింది. అలా 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది.

అతడితో ట్రాక్‌తో పాపులర్
విష్ణుప్రియ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అవడానికి తన యాంకరింగ్ ఒక కారణం అయితే.. సుడిగాలి సుధీర్‌తో ట్రాక్ నడుపుతుందన్న వార్త మరో రీజన్. 'పోవే పోరా' చేస్తోన్న సమయంలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ అలాగే వ్యవహరించడంతో అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అతడు ఫ్రెండ్ మాత్రమేనని విష్ణు వెల్లడించింది.

బుల్లితెర మీద కనిపించట్లే
బుల్లితెరపై చాలా తక్కువ సమయంలో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య ఆమె షోలను హోస్టింగ్ చేయడం లేదు. గతంలో ఆమె నడిపిన షోలు లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయాయి. అప్పటి నుంచి ఈ బ్యూటీ బుల్లితెరకు దూరమైంది. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వచ్చి అభిమానులను అలరిస్తోంది.

అందులో విష్ణు ఫుల్ బిజీగా
అప్పట్లో వరుస పెట్టి షోల మీద షోలు చేసినా.. ఈ మధ్య కాలంలో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటోన్నా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతూ
సోషల్ మీడియాలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని చేసే సందడి గురించి తెలిసిందే. ఇందులో ఆమె ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ను తెగ ఊపి పడేస్తోంది.

హాట్ భంగిమలతో డ్యాన్స్
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న విష్ణుప్రియ భీమనేని.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన నాభి, నడుము అందాలను కనిపించేలా టాప్‌ను పైకి లేపేసింది. అంతేకాదు అందాల ప్రదర్శన చేస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











