‘నాకు దేవుడు ఇచ్చిన అందం ఇదే.. దాని కోసమే వెతుకుతున్నాను’
బుల్లితెర ప్రేక్షకుల్లో విష్ణుప్రియ భీమినేని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా తన టాలెంట్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ రంగంలో పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. ఇటు బుల్లితెరపై మెప్పించడమే కాకుండా అటు వెండితెరపైనా పలు చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ విష్ణుప్రియా భీమినేని ఎంతో యాక్టివ్ గా ఉంటారు. కాగా ఆమె తన అందంగా గురించి మాట్లాడిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
విష్ణుప్రియ భీమినేని కామెంట్స్..
యాంకర్ గా విష్ణుప్రియ భీమినేని మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తను హోస్ట్ గా వ్యవహిరించిన షోలతో ఆకట్టుకుంది. టీవీ షోలతో అలరించడమే కాకుండా తనకు సమయం ఉన్నప్పుడల్లా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో తన బ్యూటీనెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ భీమినేని, రీతూ చౌదరి కనిపించడం విశేషం.

'మాకైతే రియాలిటీ తెలుసు. అందమనేది మాకు దేవుడు ఇవ్వలేదు. మేము వెతుక్కోవాల్సిందే' అని వ్యాఖ్యానించింది. ఇక రీతూ చౌదరి మాత్రం 'మాకు అని నన్ను ఎందుకు కలుపుతున్నావు. నీకు అని చెప్పొచ్చు కదా' అని అంటుంది. మొత్తానికి విష్ణుప్రియ భీమినేని తన అందంపై ఆసక్తికరంగా కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అయితే తను రియాలిటీగా మాట్లాడటంతో ఆమె మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదని, మనస్సుకు సంబంధించిందని చెబుతూ సపోర్ట్ చేశారు. విష్ణుప్రియ అభిమానులు కూడా ఆమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు.
విష్ణుప్రియ సినిమాలు..
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన విష్ణుప్రియ భీమినేని స్కూలింగ్ నుంచే ఆర్ట్స్ పై మంచి ఆసక్తిని కలిగి ఉండింది. డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో చిన్నప్పటి నుంచే ఆకట్టుకుంటూ వచ్చింది. నటిగా రాణించడం ఆమె కల. తొలుత 2018లో వచ్చిన టాలీవుడ్ స్క్వేర్స్ అనే గేమ్ షోలో సందడి చేసింది. అనుభవించు రాజా, క్యాష్, డ్యాన్స్ జోడీ డ్యాన్స్ వంటి టీవీ షోలతో అలరిస్తూ వచ్చింది.దీంతో ఆమెకు బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కింది. తన టాలెంట్ తో మరిన్ని అవకాశాలను అందుకుంది.
ఇక లేడీస్ అండ్ జెంటిల్ మెన్, దయా వంటి సిరీస్ ల్లో నటించి మెప్పించింది. మరోవైపు జరీ జరీ పంచెకట్టు అనే స్పెషల్ సాంగ్ తో వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాంటెడ్ పండుగాడ్, చెక్ మేట్ వంటి చిత్రాల్లోనూ నటించి అలరించింది. ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. మరిన్ని సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది. తన గురించి లేటెస్ట్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











