తన ఎంట్రీతో నా లైఫ్ మారిపోయింది: సుధీర్‌తో ఎఫైర్‌పై విష్ణు ప్రియ షాకింగ్ రియాక్షన్

By Manoj

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. అలాంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. తనదైన శైలి యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. కొన్నేళ్లుగా వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న ప్రచారంతో బాగా పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు ప్రియ.. సుధీర్‌తో ఎఫైర్‌పై స్పందించింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

వాళ్ల సపోర్ట్ వల్లే సాధ్యమైందంటున్న విష్ణు ప్రియ

వాళ్ల సపోర్ట్ వల్లే సాధ్యమైందంటున్న విష్ణు ప్రియ

సాదాసీదా అమ్మాయి అయిన విష్ణు ప్రియ.. ఎన్నో అవాంతరాల అడ్డంకులను దాటుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ యాంకర్లలో ఒకటిగా వెలుగొందుతోంది. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కారణమని చెబుతుంటుందామె.

ఆ ఒక్క దాని వల్లే భారీ స్థాయిలో ఫేమస్ అయింది

ఆ ఒక్క దాని వల్లే భారీ స్థాయిలో ఫేమస్ అయింది

తన కెరీర్ ప్రారంభంలో కొన్ని షోలకు యాంకరింగ్ చేసినప్పటికీ విష్ణు ప్రియకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ, ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘పోవే పోరా' ఆమె కెరీర్‌ను మార్చేసింది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. అందుకే విష్ణుకు ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది. అలాగే, షో రేటింగ్ కూడా పెరిగిపోయింది.

సుడిగాలి సుధీర్‌తో విష్ణు ప్రియ ప్రేమాయణం

సుడిగాలి సుధీర్‌తో విష్ణు ప్రియ ప్రేమాయణం

బుల్లితెర ప్లేబాయ్‌గా పేరొందాడు జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. అతడు యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, కొన్నేళ్లుగా మరో యాంకర్ విష్ణ ప్రియతోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే ‘పోవే పోరా' షోలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతోందనే టాక్ వినిపిస్తోంది.

నీ ఇంట్లో ఉంటా.. నువ్వేమీ బాధ పడకంటూ ఫోన్

నీ ఇంట్లో ఉంటా.. నువ్వేమీ బాధ పడకంటూ ఫోన్

కొద్ది రోజుల క్రితం ‘ఢీ' షోలో ఓ టాస్క్‌లో భాగంగా సుడిగాలి సుధీర్.. విష్ణు ప్రియకు ప్రాంక్ కాల్ చేశాడు. ఆ సమయంలో తాను జబర్ధస్త్, పోవే పోరా, ఢీ మానేస్తున్నట్లు ఆమెకు చెప్పి బాధ పడుతున్నట్లు యాంక్టింగ్ చేశాడు. అతడి యాక్టింగ్‌ను నిజమే అనుకున్న విష్ణు ప్రియ.. ‘మీ ఇంటికి వస్తున్నా.. నువ్వు బాధ పడకు' అంటూ అతడికి ధైర్యం చెప్పింది.

తన ఎంట్రీతో విష్ణు ప్రియ లైఫ్ మారిపోయిందట

తన ఎంట్రీతో విష్ణు ప్రియ లైఫ్ మారిపోయిందట

విష్ణు ప్రియకు శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ‘శ్రీముఖి నా బెస్ట్ ఫ్రెండ్. తను వచ్చిన తర్వాత నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తను పక్కనుంటే నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను' అని చెప్పుకొచ్చింది.

సుధీర్‌తో ఎఫైర్‌పై విష్ణు ప్రియ షాకింగ్ రియాక్షన్

సుధీర్‌తో ఎఫైర్‌పై విష్ణు ప్రియ షాకింగ్ రియాక్షన్

అదే ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణంపైనా స్పందించింది. ‘సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతడే. నేను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. మొదట కాల్ చేసేది సుధీర్‌కే. తను ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలా అని మేమిద్దరం లవర్స్ కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే' అని వివరించింది.

విష్ణును ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

విష్ణును ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు


వరుస షోలతో బిజీ యాంకర్ అయిపోయింది విష్ణు ప్రియ. ఎప్పుడూ షూటింగ్‌తో గడిపే ఆమె.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ ఫొటోలు, వీడియోలూ షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హాట్ డ్యాన్స్ చేసి.. ఆ వీడియోను పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X