For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకరింగ్ రంగంలో సత్తా చాటుతున్నారు. అందులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే, ఈ యాంకర్ మాత్రం చేసింది చాలా తక్కువ షోలే అయినా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకుంది. అదే సమయంలో ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉన్నా ఫ్యాన్స్‌ను మాత్రం కోల్పోలేదు. ఆమెనే టాల్ యాంకర్ అండ్ హాట్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని. ప్రస్తుతం పెద్దగా షోలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటోందామె. ఈ క్రమంలోనే తాజాగా బుల్లి బట్టలు ధరించి తీసుకున్న ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఘాటు ఫోజులతో ఇందులో రెచ్చిపోయింది. దానిపై మీరూ లుక్కేయండి!

  చిన్న వయసులోనే బోల్డు రోల్ చేసింది

  చిన్న వయసులోనే బోల్డు రోల్ చేసింది

  ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే విష్ణుప్రియకు 'చెక్‌మేట్' అనే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు అందరి సపోర్టుతో ఆమె అందులో నటించింది. కానీ, అప్పుడా మూవీ అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే, గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ వెలుగులోకి వచ్చింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ మూవీ ట్రెండ్ అయింది. ఇది తన ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చేసిన సినిమా అని విష్ణుప్రియనే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

  అలా మొదలెట్టి... ఇలా మారిన బ్యూటీ

  అలా మొదలెట్టి... ఇలా మారిన బ్యూటీ

  టీనేజ్‌లోనే సినిమాలో నటించిన టాల్ బ్యూటీ విష్ణుప్రియ.. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ రంగానికి దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలం పాటు సందడి చేసింది. అదే సమయంలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. అంతేకాదు, కొన్ని టీవీ షోలకు తెర వెనుక నుంచి పని చేసింది. ఇలా చాలా కాలం పాటు పలు రకాలుగా వ్యవహరించి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది.


  'కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

  ఆ ఒక్క షో.. ఆమె కెరీర్‌ను మార్చేసింది

  ఆ ఒక్క షో.. ఆమె కెరీర్‌ను మార్చేసింది

  దగ్గుబాటి రానా హోస్టుగా చేసిన 'నెంబర్ వన్ యారీ' షోకు విష్ణుప్రియ సహాయకురాలిగా చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు షోలను హోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చకు మంచి మార్కులే పడ్డాయి. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో భాగమయ్యారిద్దరూ. అదే సమయంలో ఈ షోకు భారీ స్థాయిలో టీఆర్పీని కూడా రాబట్టారు. అప్పట్లో ఇది విజయవంతంగా రన్ అయింది.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

   అతడితో లవ్ ట్రాక్... ఫుల్ ఫాలోయింగ్

  అతడితో లవ్ ట్రాక్... ఫుల్ ఫాలోయింగ్

  కొన్నేళ్ల క్రితం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 'పోవే పోరా' షోలో వీళ్లిద్దరూ చనువుగా ఉండడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఆ తర్వాత ఓ షోలో సుధీర్ ఆమెను నేరుగా ఫోన్ చేయడం.. అందులో ఆమె ఇచ్చిన రియాక్షన్ ఈ ట్రాకుపై అనుమానాలను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆమె పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. మొత్తానికి సుధీర్ తనకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమేనని విష్ణుప్రియ స్పష్టం చేసేసింది.

   అప్పటి నుంచి దూరమైన టాల్ యాంకర్

  అప్పటి నుంచి దూరమైన టాల్ యాంకర్


  చాలా ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి ప్రవేశించినా.. విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా గత ఏడాది నుంచి ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని షోలకు గెస్టుగా వచ్చి విపరీతమైన రీతిలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియకు అవకాశాలు రావడం లేదా? లేక కావాలనే ఆమె బుల్లితెరకు దూరంగా ఉంటుందా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండి

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండి

  వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా లేకున్నా విష్ణుప్రియ భీమనేని సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. తద్వారా పెద్దగా షోలు చేయకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను మరింతగా పెంచుకుంటోందీ బ్యూటీ.

  ఘాటు ఫొటోలతో షాకిచ్చిన రుహానీ శర్మ: సినిమాల్లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  Recommended Video

  Check Mate Movie Trailer Launch By Director VV Vinayak

  హాట్ డ్యాన్స్‌తో అందాల విందు చేసిందిగా

  సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ రచ్చ రచ్చ చేసే యాంకర్ విష్ణుప్రియ భీమనేని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చిన్ని టాప్‌ను ధరించి తన నాభి అందాలు కనిపించేలా నడుము ఊపుతూ డ్యాన్స్ చేసింది. అలాగే, బుల్లి నిక్కరును ధరించింది. ఫలితంగా ఈ వీడియోలో ఆమె అందాలన్నీ కనువిందు చేశాయి. దీంతో విష్ణుప్రియ షేర్ చేసిన ఈ హాట్ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ టాల్ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

  English summary
  Telugu Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Dance Video in Her Instagram. This is Gonna be Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X