For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్‌ను అమాంతం పైకి లేపేసిన విష్ణుప్రియ: అందాలను చూపిస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

    |

    బుల్లితెరపై ప్రస్తుతం సందడి చేస్తోన్న గ్లామరస్ యాంకర్లలో విష్ణుప్రియ భీమనేని ఒకరు. చిన్న వయసులోనే గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా అటు వెండితెరపైకి.. ఇటు బుల్లితెరపైకి ప్రవేశించింది. ఇక, ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా విష్ణుప్రియ టాప్‌ను అమాంతం పైకి లేపేసి హాట్ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
     అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

    అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

    ప్రస్తుతం యాంకర్‌గా వెలుగొందుతోన్న విష్ణుప్రియ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో ఎంతో కాలం పాటు తన హవాను చూపించింది. ఈ క్రమంలోనే కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. అలాగే, కొన్ని వ్యాపార ప్రకటనల్లో కనిపించింది. ఇలా కొన్ని షోలకు సైతం పని చేసింది. అనంతరం యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది.

     ఒకే ఒక్క షో క్రేజ్‌ను తీసుకొచ్చేసింది

    ఒకే ఒక్క షో క్రేజ్‌ను తీసుకొచ్చేసింది

    దగ్గుబాటి రానా చేసిన ‘నెంబర్ వన్ యారీ' షోకు సహాయకురాలిగా పని చేసిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే ‘పోవే పోరా' అనే షోతో యాంకర్‌గా బ్రేక్‌ను అందుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడమే కాదు.. షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో కీలక పాత్రలను పోషించారు.

    అతడితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చింది

    అతడితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చింది

    ‘పోవే పోరా' షో చేస్తోన్న సమయంలోనే విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశం పలుమార్లు హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఈ జంట మధ్య నిజంగానే ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సుధీర్ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే' అని క్లారిటీ ఇచ్చేసింది.

    చిన్న వయసులోనే అలాంటి సినిమా

    చిన్న వయసులోనే అలాంటి సినిమా

    ఇంటర్ చదువుతోన్న సమయంలోనే విష్ణుప్రియ ‘చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి అందరికీ భారీ షాకిచ్చిందీ బ్యూటీ.

    అప్పటి నుంచి విష్ణుప్రియ మిస్సింగ్

    అప్పటి నుంచి విష్ణుప్రియ మిస్సింగ్

    గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా బుల్లితెరపై వచ్చే షోలకు సంబంధించిన షూటింగ్‌లు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ మొదలైనప్పటికీ.. ఎక్కువ మంది జనం వచ్చే కార్యక్రమాలు చేయలేదు. అందుకే విష్ణుప్రియ - సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పోవే పోరా' ఆగిపోయింది. స్టూడెంట్లతో కలిసి చేసే ఈ షోను రన్ చేయడం కుదరకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పాలి.

     అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గునపాలు గుచ్చుతోంది.

     టాప్ లేపేసి హాట్ డ్యాన్స్‌ చేసిన భామ

    టాప్ లేపేసి హాట్ డ్యాన్స్‌ చేసిన భామ

    తాజాగా యాంకర్ విష్ణుప్రియ భీమనేని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో టాప్‌ను అమాంతం పైకి లేపేసి హాట్ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హాట్ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

    English summary
    Telugu Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Dance Video in Her Instagram. This is Gonna be Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X