టాప్ లేపేసి షాకిచ్చిన విష్ణు ప్రియ: అద్దం ముందు హాట్ ఫోజు.. యాంకర్‌ను ఇలా చూస్తే తట్టుకోలేరు

తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా సందడి చేస్తున్న అమ్మాయిల్లో.. చురుకుగా ఉంటూ అప్పటికప్పుడు పంచులు పేలుస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని. అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ఎంతగానో తపించే ఈ చిన్నది.. అద్భుతమైన టాలెంట్‌తో దూసుకుపోతోంది. గతంలో మాదిరిగా ఈ మధ్య పెద్దగా షోలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులారిటీ

అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులారిటీ

బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే విష్ణుప్రియ భీమనేని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా షోలో కనిపించింది. అప్పటి నుంచి కొన్ని షోలు చేసింది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా'తో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె హోస్టింగ్ ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది.

అతడితో ప్రేమాయణంతో హైలైట్ అయింది

అతడితో ప్రేమాయణంతో హైలైట్ అయింది

'పోవే పోరా' షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడమే కాదు.. ప్రేమ ఉన్నట్లు కూడా కనిపించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాకు నడుస్తున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో కొందరు సెలెబ్రిటీలు సైతం దీన్ని ప్రస్థావించడంతో ప్రేమాయణంపై అనుమానాలకు బలం చేకూరింది.

సుధీర్‌తో రిలేషన్‌పై అలా స్పందించిందిగా

సుధీర్‌తో రిలేషన్‌పై అలా స్పందించిందిగా

సుధీర్‌ను ప్రేమిస్తుందన్న వార్తలపై యాంకర్ విష్ణుప్రియ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 'సుధీర్ అంటే నాకిష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతనే. నేను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. మొదట కాల్ చేసేది తనకే. అతడు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలా అని మేమిద్దరం ప్రేమికులం మాత్రం కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ అంతే' అని వివరించింది.

వామ్మో ఆ సినిమాలో రెచ్చిపోయిన విష్ణు

వామ్మో ఆ సినిమాలో రెచ్చిపోయిన విష్ణు

టీనేజ్‌లోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరికీ భారీ షాకిచ్చిందీ బ్యూటీ.

అప్పటి నుంచి దూరమైన టాల్ యాంకర్

అప్పటి నుంచి దూరమైన టాల్ యాంకర్

లాక్‌డౌన్ కారణంగా బుల్లితెరపై ప్రసారం అయ్యే ఎన్నో కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అందులో విష్ణుప్రియ - సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పోవే పోరా' కూడా ఒకటి. స్టూడెంట్లను తీసుకొచ్చి చేసే ఈ షో కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో ఆమె ప్రస్తుతం ఏ షోలోనూ కనిపించట్లేదు. కానీ, శ్రీముఖితో పాటు తన స్నేహితులతో టూర్లు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

ఎప్పుడూ అందులోనే... రచ్చ చేస్తుందిగా

ఎప్పుడూ అందులోనే... రచ్చ చేస్తుందిగా

వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

Recommended Video

Check Mate Movie Trailer Launch By Director VV Vinayak
టాప్ లేపేసి షాకిచ్చింది.. అద్దం ముందు

టాప్ లేపేసి షాకిచ్చింది.. అద్దం ముందు

తాజాగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె అందం ముందు హాట్ ఫోజు ఇచ్చి కనిపించింది. తన టాప్‌ను కొంచెం పైకి లేపి.. నాభితో పాటు నడుము పూర్తిగా కనిపించేలా అద్దం ముందర ఫొటో దిగింది. ఈ మధ్య కాలంలో లావుగా కనిపించిన విష్ణు.. ఇందులో మాత్రం స్లిమ్‌గా ఉంది. దీంతో ఈ పిక్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X