యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం: ఉన్న ఒక్క బంధం దూరం.. ఇద్దరు యాంకర్లకూ ఒకేసారి!

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని చాలా కాలం పాటు వరుస షోలతో సందడి చేసిన బ్యూటీ విష్ణుప్రియ భీమనేని. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ చిన్నది పెద్దగా సందడి చేయడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమెకు ఉన్న ఏకైక బంధం దూరం అయిపోయింది. అసలేం జరిగింది? ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

 సినిమా నుంచి యాంకర్‌గా మారి

సినిమా నుంచి యాంకర్‌గా మారి

టీనేజ్‌లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. రెండేళ్ల క్రితమే ఇది ఓటీటీలో నేరుగా విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

‘పటాస్‌'తో ఎనలేని పాపులారిటీ

‘పటాస్‌'తో ఎనలేని పాపులారిటీ

బుల్లితెరపై ఎన్నో షోలలో సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు సక్సెస్‌తో పాటు మంచి పేరు తెచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆ తర్వాత విష్ణుప్రియ మాత్రం యాంకర్‌గా కెరీర్ సాగించట్లేదు.

విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం

విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం

ఒకవైపు షోలు, ఆల్బమ్‌లు చేస్తూ దూసుకెళ్తోన్న విష్ణుప్రియ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధం ఆమె తల్లి అనారోగ్య కారణాలతో శుక్రవారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు తల్లితో తీసుకున్న ఓ ఫొటోను కూడా విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

నాకు తోడుగా ఉన్నావు అంటూ

నాకు తోడుగా ఉన్నావు అంటూ

తన తల్లి తిరిగి మరణించిన విషయాన్ని యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన తల్లితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'మై డియర్ అమ్మ ఈరోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత' అంటూ రాసుకొచ్చింది.

జీవితాంతం రుణపడి ఉంటా

జీవితాంతం రుణపడి ఉంటా


ఇదే పోస్టులో యాంకర్ విష్ణుప్రియ భీమనేని 'ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు భౌతికంగా నా పక్కన లేకపోయినా.. ప్రతిచోటా, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని ఎమోషనల్ అయింది.

విష్ణును ఓదార్చుతూ పోస్టులు

విష్ణును ఓదార్చుతూ పోస్టులు


తన తల్లి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న యాంకర్ విష్ణుప్రియ భీమనేనికి ఆమె ఫాలోవర్లు బాసటగా నిలుస్తున్నారు. ఈ మేరకు ఆమెను ఓదార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో విష్ణుప్రియ మదర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో కామెంట్లను చేస్తున్నారు.

ఫ్రెండ్స్ ఇద్దరికీ వారంలోనే

ఫ్రెండ్స్ ఇద్దరికీ వారంలోనే

బుల్లితెరపై సత్తా చాటుతోన్న విష్ణుప్రియకు మరో నటి, యాంకర్ రీతూ చౌదరి క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఈ వారంలోనే రీతూ తన తండ్రిని కోల్పోయింది. అది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు విష్ణుప్రియ మదర్ కన్నుమూశారు. ఇలా వారం గ్యాప్‌లోనే ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌ ఇళ్లల్లో విషాదకర సంఘటనలు జరగడం విచారాన్నే మిగిల్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X