హాట్ వీడియోతో విష్ణుప్రియ రచ్చ: ఈ సారి ఏకంగా శృతి మించి మరీ.. అందాల అరబోత అదుర్స్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే గుర్తింపును అందుకుంటూ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో పొడుగు కాళ్ల సుందడి విష్ణుప్రియ భీమనేని ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్లింది. అయితే, ఈ మధ్య బుల్లితెరపై ఈమె పెద్దగా కనిపించట్లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

 టీనేజ్‌లోనే అలాంటి సినిమా చేసింది

టీనేజ్‌లోనే అలాంటి సినిమా చేసింది

టీనేజ్‌లోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ వెలుగులోకి వచ్చింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ మూవీ ట్రెండ్ అయింది.

 మోడలింగ్ నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ

మోడలింగ్ నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ

చిన్న వయసులోనే సినిమాలో నటించిన విష్ణుప్రియ.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలం పాటు సందడి చేసింది. ఈ క్రమంలోనే కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఇలా పాపులారిటీ సంపాదించుకుని ఆ తర్వాత యాంకర్‌గా మారింది.

 ఒక్క షోతో విపరీతమైన క్రేజ్ సొంతం

ఒక్క షోతో విపరీతమైన క్రేజ్ సొంతం

కెరీర్ తొలినాళ్లలో పలు షోలకు తెర వెనుక నుంచి పని చేసిన విష్ణుప్రియ.. 'నెంబర్ వన్ యారీ' షోకు సహాయకురాలిగా చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'పోవే పోరా' అనే షోతో సక్సెస్‌ను అందుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చకు మంచి మార్కులే పడ్డాయి. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో భాగమయ్యారిద్దరూ.

 సుధీర్‌తో ప్రేమాయణం వల్ల పాపులర్

సుధీర్‌తో ప్రేమాయణం వల్ల పాపులర్

సుదీర్ఘమైన కెరీర్‌లో.. సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో ఎక్కువగా ఫేమస్ అయింది. 'పోవే పోరా' షోలో వీళ్లిద్దరూ చనువుగా ఉండడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆమె పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. మొత్తానికి సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసేసింది.

బుల్లితెరపై కనిపించని టాల్ యాంకర్

బుల్లితెరపై కనిపించని టాల్ యాంకర్

చాలా ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి ప్రవేశించినా.. విష్ణుప్రియ స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే కనిపించింది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా గత ఏడాది నుంచి ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని షోలకు గెస్టుగా వచ్చి విపరీతమైన రీతిలో రచ్చ రచ్చ చేస్తోంది.

 అక్కడ మాత్రం రచ్చ చేస్తున్న బ్యూటీ

అక్కడ మాత్రం రచ్చ చేస్తున్న బ్యూటీ

వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా లేకున్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది.

Recommended Video

Check Mate Movie Trailer Launch By Director VV Vinayak
బెల్లీ డ్యాన్స్‌తో అందాల విందు చేసింది

బెల్లీ డ్యాన్స్‌తో అందాల విందు చేసింది

తాజాగా యాంకర్ విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ హాట్ బెల్లీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చిన్ని టాప్‌ను ధరించి తన నాభి అందాలు కనిపించేలా నడుము ఊపుతూ డ్యాన్స్ చేసింది. ఫలితంగా ఈ వీడియోలో ఆమె అందాలన్నీ కనువిందు చేశాయి. తద్వారా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇది కాస్తా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X