డబ్బుల కోసం వాళ్లతో ఆ పనులు చేయాలా: బిగ్ బాస్‌పై విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెరపై పాపులారిటీ ఉన్న యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. కెరీర్ ఆరంభంలో కొన్ని షోలలో అసిస్టెంట్ తరహా పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ రంగంలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ వార్తలతో హాట్ టాపిక్ అయింది. చాలా రోజులుగా బుల్లితెరపై కనిపించని ఈమె.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. డబ్బుల కోసం అలాంటి పనులు చేయనని చెప్పుకొచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆ ఒక్క షోనే పేరు తెచ్చిపెట్టింది

ఆ ఒక్క షోనే పేరు తెచ్చిపెట్టింది

కెరీర్ ఆరంభంలో కొన్ని షోలలో పని చేసింది విష్ణు ప్రియ. యాంకర్‌గా మాత్రం ఆలస్యంగా పరిచయం అయింది. ఆ తర్వాత జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా' షో ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో షోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ షో వల్ల విష్ణు ప్రియకు సైతం యూత్‌లో పాపులారిటీ వచ్చేసింది.

సుధీర్‌తో లవ్ ట్రాక్‌తో పాపులర్

సుధీర్‌తో లవ్ ట్రాక్‌తో పాపులర్

సుడిగాలి సుధీర్‌తో షో చేస్తున్న కారణంగానో.. మరే రీజనో తెలియదు కానీ.. అతడితో విష్ణు ప్రియ ప్రేమాయణం సాగిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ షోలో రొమాన్స్ పండించడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఆ తర్వాత ఈ విషయంపై పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. శ్రీముఖి తర్వాత సుధీరే తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.

మరీ అలా కనిపించడంతో షాక్

మరీ అలా కనిపించడంతో షాక్

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘చెక్‌మేట్' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో అమ్మడు తన అందంతో అదరగొట్టేసింది. అంతేకాదు, క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

బిగ్ బాస్‌ షోపై షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్‌ షోపై షాకింగ్ కామెంట్స్

‘పోవే పోరా' షోకు బ్రేక్ రావడంతో విష్ణు ప్రియ మరే షోలోనూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ తాజాగా ఆమెను ప్రశ్నించింది ఓ యూట్యూబ్ ఛానెల్. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ విష్ణు ప్రియ.

ఇంత అందాన్ని వదిలి వెళ్లలేను

ఇంత అందాన్ని వదిలి వెళ్లలేను

బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోలోకి నేను ఎందుకు వెళ్తాను. లక్షలు కాదు.. కోట్లు ఇచ్చినా ఆ షోలోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. అయినా బయట ఇంత అందమైన ప్రపంచాన్ని ఉంచుకుని.. బిగ్ బాస్ హౌస్‌లో బందీగా ఎందుకు ఉండాలి. అందుకే ఆ షోను ఇప్పటి వరకు చూడలేదు. చూడను కూడా' అని చెప్పుకొచ్చింది.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
 డబ్బుల కోసం ఆ పనులు చేయాలా

డబ్బుల కోసం ఆ పనులు చేయాలా

దీనిని కొనసాగిస్తూ ‘బిగ్ బాస్‌లో కొట్టుకోవడాలు, గొడవలు పెట్టుకోవడాలు ఉంటాయి. అలాగే ప్రతి వారం ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఎవర్నీ ఎలిమినేట్ చేయకూడదు. వీలైతే ప్రేమించాలి. డబ్బుల కోసం ఈ పనులు చేయాలి. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోకి అయితే వెళ్లను. రాసిపెట్టుకోండి. వెళ్తే నాపై వార్తలు రాయండి' అని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X