Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా రొమాన్స్ చూసి సుధీర్ ఫీలయ్యాడు: పర్సనల్ మేటర్ అంటూనే లీక్ చేసిన విష్ణు ప్రియ
తెలుగు బుల్లితెరపై ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది. యాంకరింగ్‌లో రాణించడంతో పాటు జబర్ధస్త్ కమెడియన్‌తో లవ్ ట్రాక్ వంటి విషయాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఇటీవల బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ టాల్ బ్యూటీ.. తాజాగా సుడిగాలి సుధీర్‌తో జరిగిన ఓ పర్సనల్ విషయాన్ని లీక్ చేసింది. అంతేకాదు, అతడు తన రొమాన్స్ చూసి బాగా ఫీలయ్యాయడని చెప్పింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఇలా వచ్చింది.. అలా పాపులర్ అయింది
విష్ణు ప్రియ కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పలు షోలలో కూడా పని చేసింది. ఈ క్రమంలోనే ‘పోవే పోరా'తో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి షోలోనే మెప్పించింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి పోటాపోటీగా హోస్టింగ్ చేస్తూ ఆకట్టుకుంది. దీంతో విష్ణు ప్రియకు యూత్‌లో భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఫలితంగా బాగా పాపులర్ అయిపోయింది.

సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్‌తో హాట్ టాపిక్
విష్ణు ప్రియ కెరీర్ అప్పుడప్పుడే ఊపందుకుంటోన్న సమయంలో ఆమె గురించి బయటకు వచ్చిన కొన్ని వార్తలు కలకలం రేపాయి. ‘పోవే పోరా'లో తన కో యాంకర్ అయిన సుడిగాలి సుధీర్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరగడంతో హాట్ టాపిక్ అయిపోయింది. దీని తర్వాత పలుమార్లు సుధీర్.. విష్ణు ప్రియ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి.

సుధీర్‌తో తనకు ఉన్న బంధంపై క్లారిటీ
సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న వార్తలపై విష్ణు ప్రియ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ‘సుధీర్ అంటే నాకిష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతడే. నేను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. మొదట కాల్ చేసేది సుధీర్‌కే. తను ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలా అని మేమిద్దరం లవర్స్ కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే' అని వివరించింది.

చిన్నప్పుడే మొదలు.. ఇప్పుడు రిలీజ్
యాంకర్ విష్ణు ప్రియ ‘చెక్‌మేట్' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో అమ్మడు తన అందంతో అదరగొట్టేసింది. అంతేకాదు, క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో జరిగినా అనివార్య కారణాలతో ఇప్పుడు రిలీజ్ అవుతోంది.

పర్సనల్ మేటర్ అంటూనే లీక్ చేసింది
‘చెక్‌మేట్' సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విష్ణు ప్రియ క్లీవేజ్ షో గురించే అందరూ చర్చించుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చేసిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఇటీవల వెల్లడించిందామె. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సుధీర్ గురించి మాట్లాడుతూ ఓ పర్సనల్ మేటర్ లీక్ చేసింది.

నా రొమాన్స్ చూసి సుధీర్ ఫీలయ్యాడు
ట్రైలర్‌లో మీ బోల్డ్ సీన్స్ సుధీర్ చూశాడా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించగా.. ‘ట్రైలర్‌లో రొమాన్స్ చూసి బాగా ఫీలయ్యాడు పాపం. పర్సనల్ మేటర్ కాబట్టి ఇంకేం చెప్పలేను. అంతేకాదు, ఈ సినిమాలో సుధీర్ కూడా ఉన్నాడు. కానీ, మా ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. హీరోగా ఫ్రెండ్‌గా చేశాడు. ఆ విషయం కూడా ఈ మధ్యే తెలిసింది' అని విష్ణు ప్రియ వివరించింది.