For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోపై యాంకర్ విష్ణుప్రియ దారుణ కామెంట్స్: ‘చూస్తే నలిపేయడమే’ అంటూ మేటర్ లీక్ చేయడంతో!

  |

  తెలుగు బుల్లితెరపైకి యాంకర్లుగా వచ్చిన అమ్మాయిల్లో కొందరు మాత్రమే కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లారు. మిగిలిన వాళ్లు అవకాశాలను సరిగా వినియోగించుకోలేక పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. యాంకర్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ అమ్మడు.. ఈ మధ్యన బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణుప్రియ.. టాలీవుడ్‌లోని ఓ యంగ్‌ హీరోపై హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  చిన్న వయసులో బోల్డు రోల్

  చిన్న వయసులో బోల్డు రోల్

  టీనేజ్‌లో ఉన్నప్పుడే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. అయితే, ఈ చిత్రం గత ఏడాదే విడుదల అయింది.

  Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు సేఫ్ అవడంతో వాళ్లకు షాక్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే!

  అలా పరిచయం అయింది

  అలా పరిచయం అయింది

  హీరోయిన్‌గా నటించినా.. ఈ చిత్రం అప్పుడు విడుదల కాకపోవడంతో విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో కనిపించింది. తర్వాత కూడా కొన్ని షోలు చేసింది.

   యాంకర్‌గా ఎంట్రీ.. వాటిలో

  యాంకర్‌గా ఎంట్రీ.. వాటిలో

  కొన్ని షోలలో పని చేసిన అనుభవం ఉన్న విష్ణుప్రియ భీమనేని యాంకర్‌గా బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు గుర్తింపును అందించింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, విష్ణుప్రియ మాత్రం ఆచితూచి అడుగులు వేసింది.

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

  టీవీకి దూరం.. ఆల్బమ్‌లు

  టీవీకి దూరం.. ఆల్బమ్‌లు

  'పోవే పోరా' షో తర్వాత యాంకర్‌గా విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఒప్పుకోలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ నడిపించడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లలో కనిపిస్తోంది.

  ఆ షోలో పాల్గొన్న యాంకర్

  ఆ షోలో పాల్గొన్న యాంకర్

  ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియ షోల సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది. కానీ, సినిమాలు, ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే జీ తెలుగులో ప్రసారం అవుతోన్న లేడీస్ అండ్ జెంటిల్‌మన్ అనే షోకు సీరియల్ నటుడు మానస్‌తో కలిసి వచ్చింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

   ఆ హీరోపై క్రష్ అని చెప్పి

  ఆ హీరోపై క్రష్ అని చెప్పి

  గత ఆదివారం ప్రసారం అయిన 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' షోలో పాల్గొన్న విష్ణుప్రియ తనదైన అల్లరితో తెగ హడావిడి చేసింది. ఇందులో ఆమె కామెడీ చేయడంతో పాటు యాంకర్ ప్రదీప్‌పై పంచులు పేల్చింది. ఈ క్రమంలోనే షో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు ఆమెను 'విష్ణుప్రియ నీ క్రష్ ఎవరు' అని ప్రశ్నించాడు. దీనికామె 'అఖిల్ అక్కినేని అంటే నాకు క్రష్' అనేసింది.

  చూస్తే నలిపేయడమే అని

  చూస్తే నలిపేయడమే అని

  యాంకర్ ప్రదీప్ మాచిరాజు అడిగిన ప్రశ్నకు విష్ణుప్రియ సమాధానం చెప్పడంతో పాటు 'అఖిల్ అక్కినేని మీద నాకు ఉంది. అతడిని చూస్తే నలిపేయాలని అనిపిస్తుంది' అంటూ సైగలు చేస్తూ తెగ సిగ్గు పడిపోయింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ప్రదీప్ 'భయ్యా.. ఏజెంట్ మూవీలో గన్‌లు ఒరిజినల్ అయితే వేసేయ్' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.

  English summary
  Tollywood Actress and Anchor Vishnupriya Participated in Ladies & Gentlemen Show. She Shows Love on Young Hero Akhil
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X