తెలుగు టాప్ యాంకర్ షాకింగ్ డెసిషన్ .. అన్ని వదిలేసి , ఇకపై ఆయనతోనే!

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్తున్న యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో వారు సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో యువత కృంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఆలయాలు, ప్రార్ధనా స్థలాలలో యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన స్టార్ యాంకర్ కూడా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు.

1986 ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో జన్మించారు విష్ణుప్రియ. ఆమెకు చెల్లెలు పావని ఉన్నారు. ఈమెకు మూడేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తల్లి దగ్గరే విష్ణుప్రియ పెరిగింది. చిన్న వయసులోనే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది. చదువు పూర్తి చేసిన తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసిన విష్ణుప్రియకు తమిళంలో శివప్పతి గారమ్ అనే మూవీలో ఛాన్స్ దొరికింది.

anchor Vishnupriyaa bhimeneni moved to Himalayas her social media posts goes viral

తర్వాత ఏకంగా ఎస్ఎస్ రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అవకాశాల కోసం ఎంతో కష్టపడి చివరికి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. పెళ్లిచూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, యెల్లో, సోడాబుడ్డీ, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. 2017లో ఈటీవీ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమైన పోవే పోరా ప్రోగ్రామ్‌ను సుడిగాలి సుధీర్‌తో కలిసి అద్భుతంగా హోస్ట్ చేసి పాపులర్ అయ్యింది.

యాంకరింగ్‌తో పాటు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో తనలోని టాలెంట్‌ను చూపించారు విష్ణుప్రియ. గతేడాది బిగ్‌బాస్ తెలుగు 8లోనూ అవకాశం దక్కించుకుంది. తొలుత టైటిల్ విజేతగా నిలుస్తారని అంతా అనుకోగా.. పృథ్వీతో ప్రేమాయణం ఆమె అవకాశాలను దెబ్బతీసింది. దీంతో ఫైనల్ చేరడానికి ముందే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చినా విష్ణుప్రియకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విష్ణుప్రియ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసుల ఎదుట హాజరైంది.

ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చడంతో పాటు విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. జీవితంలో వరుస కష్టాల నేపథ్యంలో విష్ణుప్రియ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. తొలి నుంచి శివ భక్తురాలు కావడంతో ఆలయాలకు వెళ్లడం ఈమెకు అలవాటే .

అయితే ఈసారి మాత్రం విష్ణుప్రియ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కొద్దిరోజులు హిమాలయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని.. కొన్నాళ్లు హిమాలయాలే నా ఇల్లు అని విష్ణుప్రియ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో హిమాలయాల్లోనే ఉండి భగవంతుడి సేవలో తరించడంతో పాటు మానసికంగా ప్రశాంతత పొందాలని విష్ణుప్రియ అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X