ఆ దీక్షకు బై బై .. మళ్లీ మొదలెట్టిన విష్ణుప్రియ, వల లాంటి చీరలో గ్లామర్ ట్రీట్!
తెలుగునాట టాప్ యాంకర్‌గా వెలుగొందాలని అనుకున్న విష్ణుప్రియ కలలు కల్లలే అయ్యాయి. అన్ని ఉన్నప్పటికీ ఎందుకో ఈ ముద్దుగుమ్మ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేకపోయింది. బిగ్‌బాస్‌లో ఇరగదీద్దామని వచ్చి.. అక్కడ కూడా ఫైనల్‌కు ముందు బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కెరీర్ షరా మామూలే అన్నట్లుగా సాగింది. ఇంతలో ఓ స్కామ్‌లో ఆమె పేరు వినిపించడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొద్దిరోజుల క్రితం ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టిన విష్ణుప్రియ మళ్లీ రూట్ మార్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
చిన్నతనంలోనే కష్టాలుపడ్డ విష్ణుప్రియ
ప్రకాశం జిల్లాకు చెందిన విష్ణుప్రియ కుటుంబం అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగింది. ఆ సమయంలో తను తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని పలుమార్లు విష్ణుప్రియ చెప్పారు. పురాణాలు, ఇతర ఆధ్యాత్మిక విషయాలపై పట్టు ఉండటంతో పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది విష్ణుప్రియ. చదువు పూర్తి చేసిన తమిళంలో శివప్పతి గారమ్ అనే మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

పోవే పోరాతో లైమ్‌లైట్‌లోకి
తర్వాత ఎస్ఎస్ రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగలో నటించినా అది చిన్న పాత్రే కావడంతో సరైన గుర్తింపు రాలేదు. అవకాశాల కోసం షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది విష్ణుప్రియ. ఈ దశలో 2017లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన పోవే పోరా ప్రోగ్రామ్‌ను సుడిగాలి సుధీర్‌తో కలిసి అద్భుతంగా హోస్ట్ చేసి జనానికి నోటెడ్ అయ్యింది. యాంకరింగ్‌తో పాటు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ కనిపించారు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డానని బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. బిగ్‌బాస్ తెలుగు 8లో అవకాశం దక్కించుకుంది. అయితే ఆటపై దృష్టి పెట్టకుండా పృథ్వీ చుట్టూ తిరగడంతో అసలుకే మోసం వచ్చింది. చివరి వరకు ఇదే కంటిన్యూ చేయడంతో ఫైనల్‌కు ముందు ఎలిమినేట్ అయ్యింది.
కలిసిరాని బిగ్‌బాస్
బిగ్‌బాస్ పాపులారిటీ ఈమె కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఏవో షోలలో కనిపించడం తప్పించి చెప్పుకోదగ్గ ఆఫర్ అందుకోలేదు. ఫోటో షూట్‌లు, వీడియోలతో కాలం గడుపుతున్న దశలో ఇటీవల ఓ స్కామ్‌లో ఇరుక్కుని చివరికి పోలీసుల ఎదుట విచారణకు కూడా హాజరై చెడ్డ పేరును మూటకట్టుకుంది విష్ణుప్రియ. వరుస ఇబ్బందులతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసిన విష్ణుప్రియ తీర్ధయాత్రలు చేశారు. కొద్దిరోజుల క్రితం తాను హిమాలయాలకు వెళ్లిపోతున్నానని కొన్నాళ్లు అక్కడే ఉంటానని బాంబు పేల్చింది.
వల లాంటి చీరతో గ్లామర్ షో
కట్ చేస్తే ఇప్పుడు ఆమె దీక్ష ముగిసినట్లుగానే కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. వల లాంటి చీర కట్టుకుని తన అందాలను చూపిస్తున్నారు విష్ణు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అప్పుడే నీ దీక్ష ముగిసిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











