Anchor Shyamala: "మా ఆయనే నాకు ఆ డ్రగ్ అలవాటు చేశారు.. అదిలేకపోతే అస్సలే ఉండలేను"
బుల్లితెరపై చాలా కాలంగా ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ తో బుల్లితెరపై సందడి చేసే వాళ్లలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా కనిపిస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈమె తాజాగా షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన భర్తే తనకు డ్రగ్ ఇచ్చాడని వివరించింది. ప్రస్తుతం అది లేకపోతే తాను జీవించలేకపోతున్నానని వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వయసులోనే యాంకర్ గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది యాంకర్ శ్యామల. ఓవైపు యాంకర్ గా కనిపిస్తూనే.. మరోవైపు లయ, అభిషేకం, గోరింటాకు వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. ఇలా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరైన ఈ బ్యూటీ మా ఊరి వంట, పట్టుకుంటే పట్టుచీర వంటి షోలు చేసింది. అలాగే లౌక్యం, ఒక లైలా కోసం వంటి సినిమాలు కూడా చేసింది. ఇలా కెరియర్ సాగుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ తోటి నటుడు నరసింహతో ప్రేమలో పడింది.

అయితే ఆ విషయాన్ని దాచి చాలా కాలం పాటు సీక్రెట్ గానే లవ్ ట్రాక్ నడిపించింది. అలా కొంత కాలం కాగానే పెళ్లి చేసుకోవాలనుకున్న వీళ్లు ఇరు కుటుంబాల్లో విషయాన్ని చెప్పారు. ముందుగా యాంకర్ శ్యామల తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఎలాగోలా ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ బాబు కూడా జన్మించగా.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల షాకింగ్ కామెంట్లు చేసింది.
ముఖ్యంగా తనకు యాంకరింగ్ చేయాలనే ఆసక్తే లేదని చెప్పుకొచ్చింది. కానీ తన భర్తే పదే పదే చెప్పి మరీ యాంకరింగ్ లోకి తోశాడని.. అలా వెళ్లిన తనకు కొంచెం కొంచెంగా దానిపై ప్రేమ పెరిగిందని వివరించింది. ఆయన ఎక్కించిన ఈ డ్రగ్ వల్ల.. ఇప్పుడు తాను యాంకరింగ్ లేకపోతే లేని పరిస్థితికి వచ్చినట్లు వివరించింది. అయితే డ్రగ్ అనే పదం వాడడంతో.. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. యాంకర్ శ్యామల భర్త పేరు గతంలో ఓ డ్రగ్ కేసులో వినిపించగా.. మరోసారి ఆమె తన భర్తే ఈ డ్రగ్ ఎక్కించాడని చెప్పగా.. ఈ న్యూస్ వైరల్ గా మారింది.

యాంకర్ శ్యామల చెప్పిన విషయమై వేరు అయినప్పటికీ.. థంబ్ నెయిల్స్ ఇలాగే పెట్టుకుంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు రాస్తున్నారు. కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే యాంకర్ అనే డ్రగ్ ను తన భర్తకు తన మెదడులోకి ఎక్కించాడని.. దాని వల్లే తన కెరియర్ ఇప్పుడు సాఫీగా సాగుతుందని అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











