Bigg Boss Telugu 11 th Week Elimination: నాగిని డ్యాన్సర్ ఎలిమినేటెడ్! అందరూ ఊహించినట్టే..
Bigg Boss Telugu 5 Elimination
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో చివరి దశకు చేరుకోవడంతో టైటిల్ రేసులో ఎవరు నిలవనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సుమారు 80వ ఎపిసోడ్ దగ్గరకు చేరడంతో టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్లనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. 19 మందితో మొదలైన ఈ గేమ్ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో లీకయింది. ఆ వివరాల్లోకి వెళితే
Photos Courtesy: Star మా and Disney+Hotstar

ఎవరు నిలవనున్నారు ?
బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్ జాబితాలో ఎవరు నిలవనున్నారు అనేది తాజా ఎలిమినేషన్ తర్వాత 12వ వారంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ లో కొనసాగడం చాలా ముఖ్యం కావడంతో తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓటింగ్ గట్టిగానే గుద్దారు.

గత ఎలిమినేషన్స్ ఇలా
నిజానికి ముందు నుంచి కూడా హౌస్ లో ఎలిమినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. హౌస్ లో మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదవ వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడవ వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదవ వారంలో విశ్వ, పదవ వారంలో జెస్సీ ఎలిమినేట్ అయ్యారు.

11వ వారం నామినేషన్‌లో
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో 11వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే హౌస్ లో తొమ్మిది మంది ఉండగా హౌస్ కెప్టెన్ రవి మినహాయించి మిగతా 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ యాంకర్ రవి తప్ప మిగితా వారందరూ నామినేషన్‌లోకి రావడంతో మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, ఆర్జే కాజల్ నామినేషన్‌స్ లో తేలారు.

రెండు టీంలుగా
నిజానికి ప్రస్తుతం హౌస్‌లో ఉన్న తొమ్మిది మంది రెండు టీంలుగా విడిపోగా వారి మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తుంది. సన్నీ, కాజల్, మానస్, ప్రియాంకలు ఒక టీంగా ఉంటే.. షణ్ముఖ్, సిరి, రవి, శ్రీరామ్, ఆనీ మాస్టర్ ఒక జట్టుగా ఉండి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిందని అంటున్నారు.

అనీ మాస్టర్
నిజానికి బిగ్‌బాస్ నుంచి 11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ముందు నుంచే మా వెబ్ సైట్ ఓటింగ్ సహా అనేక వెబ్ సైట్స్ వోటింగ్స్ తేల్చేశాయి. అదీ కాక వచ్చే వారం జరిగే ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆమెను తప్పిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఈ వారం తప్పుకునేది పింకీ లేదా అనీ మాస్టర్ అని అందరూ భావించారు.

లోపలికి తీసుకువెళ్లే ప్లాన్
అయితే వచ్చే వారం హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు అందరినీ లోపలికి తీసుకువెళ్లే ప్లాన్ ఉందని, అలాంటి సమయంలో పింకీ లోపల ఉంటే మంచి ఎమోషన్స్ పండి ఆమె వల్ల టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని, అందుకే ఒకవేళ ఆమెకు తక్కువ ఓటింగ్ వచ్చినా ఈ కారణంగా ఆమె హౌస్ లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
Recommended Video

ఈరోజు ఆ నలుగురు సేఫ్
ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కొంతమందిని సేవ్ చేస్తారు అనే సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఎపిసోడ్ లో షన్ను , మానస్, కాజల్, సన్నీలను నాగార్జున సేవ్ చేసినట్టు చెబుతన్నారు. అంటే ఇంకా నలుగురు రేపటి వరకు టెన్షన్ భరాయించబోతున్నారు. వారు అనీ మాస్టర్, శ్రీ రామ చంద్ర, పింకీ, సిరి. వీరిలో అనీ మాస్టర్ ఖాయంగా బయటకుయ్ వచ్చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











