For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్‌లో మోనాల్ బండారం బయట పెట్టిన ఆనీ మాస్టర్: అఖిల్‌తో అలాంటి పని.. ఇబ్బంది పెడుతున్నారంటూ!

  |

  అప్పుడెప్పుడో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఈ మధ్య కాలంలోనే ఫుల్ ఫేమస్ అయింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. దీనికి కారణం బిగ్ బాస్ షోలో ఆమె వ్యవహరించిన తీరే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో అఖిల్ సార్థక్‌తో కలిసి ఆమె చేసిన రచ్చను ఎవరూ మర్చిపోలేరు. ఇక, బయట కూడా వీళ్లిద్దరూ అదే రీతిలో ఎంజాయ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే డ్యాన్స్ ప్లస్ జడ్జ్ ఆనీ మాస్టర్.. మోనాల్ - అఖిల్ ప్రేమాయణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  మోనాల్ అలా.. అఖిల్ ఇలా ఫేమస్

  మోనాల్ అలా.. అఖిల్ ఇలా ఫేమస్

  అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసి వెళ్లిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షోలో ఆఫర్ అందుకుని తిరిగి వచ్చింది. ఇక, మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి పలు సినిమాల్లో, సీరియళ్లలో నటించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు.

  ఆరంభంలోనే ప్రేమ.. రచ్చ చేసేశారు

  ఆరంభంలోనే ప్రేమ.. రచ్చ చేసేశారు

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. ఆరంభంలోనే ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడేవారు. అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాను కూడా చూపించారు. అలా బిగ్ బాస్ హౌస్‌లో హగ్గులు, ముద్దులతోనూ రచ్చ రచ్చ చేశారు. దీంతో ఈ జంట తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫేమస్ అయిపోయింది.

  బయట కూడా అదే విధంగా చేస్తూనే

  బయట కూడా అదే విధంగా చేస్తూనే

  బిగ్ బాస్ హౌస్‌లో జంటగా రచ్చ రచ్చ చేసిన మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తరచూ కలుసుకోవడం.. పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ తమ ప్రేమను ఎప్పుడూ వ్యక్త పరచుకుంటున్నారు. దీంతో ఈ బిగ్ బాస్ జంట నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటోన్న విషయం తెలిసిందే.

  మోనాల్ అందులో.. అఖిల్ ఇందులో

  మోనాల్ అందులో.. అఖిల్ ఇందులో

  బిగ్ బాస్ షో వల్ల మోనాల్ గజ్జర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ‘డ్యాన్స్ ప్లస్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తోంది. అలాగే, మరికొన్ని అవకాశాలనూ అందుకుంటోంది. ఇక, అఖిల్ సార్థక్ ఇటీవలే ‘ఫస్ట్ టైమ్' అనే సినిమాను ప్రకటించాడు. హేమంత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకుంది.

  ఆలస్యంగా రాబోతున్న ప్రేమ జంట

  ఆలస్యంగా రాబోతున్న ప్రేమ జంట

  అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రేమికుల రోజున ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఆ వెబ్ సిరీస్ కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

  మోనాల్ బండారం బయట పెట్టిన ఆనీ

  మోనాల్ బండారం బయట పెట్టిన ఆనీ

  మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక వీడియో చేసిన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటోంది. తాజాగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో ఆనీ మాస్టర్.. మోనాల్ బండారం బయటపెట్టింది. అఖిల్ సార్థక్‌తో ఆమె ప్రేమలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో అతడి పేరు తీసుకురావద్దని మోనాల్ వాదించింది.

  Gangavva మనవడి పెళ్లి ! ఆసక్తికరంగా శుభలేఖ | Anil Jeela || Filmibeat Telugu
  అఖిల్‌తో అలాంటి పని.. ఇబ్బందిగా

  అఖిల్‌తో అలాంటి పని.. ఇబ్బందిగా

  ఆనీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మోనాల్ - అఖిల్‌కు సంబంధించిన పోస్టులు పెడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. వాళ్ల మధ్యలో నేనేందుకు చెప్పండి. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అలాంటి పనులు చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మోనాల్.. ఇప్పుడు అఖిల్ పేరు ఎందుకు చెప్పారు అంటూ ఆమెతో ఫన్నీగా గొడవకు దిగింది.

  English summary
  Monal Gajjar is an Indian actress and has worked in Gujarati, Telugu, Hindi, and Marathi films. She started her career with a 9 to 5 job at ING Vysya Bank in Ahmedabad, after completing her graduation. Later, her Yoga teacher advised her to participate in ‘Mirchi Queen Bee,’ a beauty pageant contest organised by Radio Mirchi in 2011.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X