For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరోనా సోకిన ఆనీ మాస్టర్‌కు సన్నీ ఫ్యాన్ షాక్: నీకు అందుకే వచ్చిందంటూ దారుణంగా!

  |

  గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా వేగంగా విస్థరిస్తోంది. దీంతో ప్రతిరోజూ రెండు రాష్ట్రాల్లో కలిపి భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఫలితంగా ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులకు ఈ వైరస్ సోకింది. దీంతో టాలీవుడ్‌లో ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురు సెలెబ్రిటీలు పాజిటివ్‌గా తేలుతున్నారు.

  ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేం ఆనీ మాస్టర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిందామె. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ అభిమాని ఆమెను ట్రోల్స్ చేశారు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  టాలీవుడ్‌ను చుట్టేస్తోన్న కరోనా వైరస్

  టాలీవుడ్‌ను చుట్టేస్తోన్న కరోనా వైరస్

  మూడో దశలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కరోనా వైరస్ చాలా వేగంగా సోకుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు, రాజేంద్ర ప్రసాద్, థమన్, చిరంజీవి, శ్రీకాంత్ సహా ఎంతో మంది ప్రముఖులకు కోవిడ్ సోకింది. అంతేకాదు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు సహా చాలా మంది టెక్నీషియన్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వాళ్లంతా క్రమంగా కోలుకుంటున్నారు.

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్‌కు కరోనా

  కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్‌కు కరోనా

  కరోనా మహమ్మారి ధాటికి సినీ, బుల్లితెర సెలెబ్రిటీలు వణికిపోతున్నారు. అంతలా ఇది వేగంగా విస్తరిస్తోంది. దీంతో రెండు రంగాలకు చెందిన వాళ్లు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేం ఆనీ మాస్టర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

  అప్పుడు పోయిన రోజే.. ఇప్పుడిలాగ

  అప్పుడు పోయిన రోజే.. ఇప్పుడిలాగ

  గతంలో కూడా ఆనీ మాస్టర్‌కు కోవిడ్ సోకింది. ఇప్పుడు మళ్లీ రావడంతో ఆమె ‘గ‌తేడాది కూడా నాకు కరోనా వ‌చ్చింది. 24 రోజుల త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి 23న నాకు కోవిడ్ త‌గ్గిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు జ‌న‌వ‌రి 24న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా ఏమైనా టైం మెయింటెన్ చేస్తుందా? క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది' అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

  రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!

  సన్నీ అభిమాని ట్రోల్.. షేర్ చేసింది

  సన్నీ అభిమాని ట్రోల్.. షేర్ చేసింది

  తనకు కరోనా వైరస్ సోకిందని ఆనీ మాస్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, సన్నీ అభిమాని అని ఒక అమ్మాయి ‘నువ్వు సన్నీని సపోర్ట్ చేయలేదు కదా. అందుకే నీకు మళ్లీ రావాల్సిందే' అంటూ మెసేజ్ చేసింది. దీన్ని ఆనీ మాస్టర్ షేర్ చేసింది.

  సన్నీ బాబా ఏదైనా సహాయం చేయవా

  సన్నీ బాబా ఏదైనా సహాయం చేయవా

  సన్నీ అభిమాని అని చెప్పుకున్న సదరు అమ్మాయి.. చేసిన మెసేజ్‌ స్క్రీన్ షాట్‌ను ఆనీ మాస్టర్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకుంది. అంతేకాదు, దీనికి ‘నువ్వు ఇంకా ఎదగాలి' అంటూ కామెంట్ చేసింది. అదే సమయంలో వీజే సన్నీని ట్యాగ్ చేస్తూ.. ‘సన్నీ బాబా.. నాకు కరోనా తగ్గడానికి ఏదైనా సహాయం చెయ్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.

  చిన్న క్లాత్‌ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

  Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
  సన్నీతో గొడవలు.. అతడికి మద్దతు

  సన్నీతో గొడవలు.. అతడికి మద్దతు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆనీ మాస్టర్.. ఆరంభం నుంచే వీజే సన్నీతో కలిసేది కాదు. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఆమె శ్రీరామ చంద్రకు మద్దతు తెలిపింది. దీంతో సన్నీ అభిమానులు ఆమెను తెగ ట్రోల్ చేసేవారు. ఇలానే ఇప్పుడు కరోనా సోకిన సమయంలో కూడా ఇలా కామెంట్ చేయడాన్ని చాలా మంది తప్పుబడుతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Fame and Famouse Choreographer Anee Master Tests Positive For Corona. Then VJ Sunny Fans Trolls on her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X