Guppedantha Manasu May 24th: రిషి లేడు, రాడు.. దుఃఖంలో వసు.. మనును దత్తత తీసుకుంటానంటున్న శైలేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మను ఏంజెల్ వద్దకు వస్తాడు. ఏంటి ఎప్పుడు ఇలాగే కోపంగా ఉంటావా నీవు అని ఏంజెల్ అనగా.. నేను మామూలుగానే ఉన్నానంటూ మను చెప్పుకొస్తాడు. నార్మల్ గా ఉంటేనే ఇలా ఉన్నావా, మరి ఇంకా కోపంగా ఉంటే ఇంకెలా ఉంటావో అంటూ చెప్పుకొస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లు అంటూ మను అనగా.. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడాలనుకున్నానంటూ ఏంజెల్ అంటుంది. అలాగే నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నానంటూ చెబుతూనే వెళ్తానంటుంది. కానీ మను మాత్రం ఆపడు. నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉన్నారా, లవ్ స్టోరీ ఇందా అనగా.. ఒకర్ని ప్రేమించాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నానంటూ తెలుపుతాడు.

అందుకే నువ్వు ఎప్పుడూ మూడీగా ఉంటావా అనగా.. ఎవరు ఆ అమ్మాయి అని ఏంజెల్ అడుగుతుంది. అమ్మాయి కాదు మా అమ్మను అనగానే.. అమ్మా.. నువ్వు ఇప్పటి వరకు చెప్పింది అత్తయ్య గురించా అంటూ షాక్ అవుతుంది ఏంజెల్. ఆ తర్వాత కనీసం నీకెవరైనా ప్రపోజ్ చేశారా అంటుంది. నువ్వు ఇంత ముద్దుగా, అందంగా ఉంటే పదులు, వందల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయని అంటుంది. నిన్ను ఇంత వరకు ఎంత మంది లవ్ చేసి ఉంటారో.. చెప్పకుండా పాపం ఎంత మంది తమ మనసుల్లోనే సమాధి చేసుకున్నారంటూ అంటుంది. ఆ తర్వాత నా మీద నీ ఒపీనియన్ ఏంటి బావా అంటుంది. అనుపమ అత్తయ్య నాకు అత్తయ్య అయినప్పుడు, ఆమె కొడుకు బావే కదా అవుతాడు.. అత్తకు ఫోన్ చేయు అంటూ అడుగుతుంది.

Angel Romantic Words to manu on Guppedantha Manasu May 24th 2024 Episode 1083

వద్దని మను అనగా.. నువ్వేంటి ఇలా ఉన్నావంటూ అడుగుతాడు. ఆ తర్వాత ఏంజెల్ వెళ్లిపోతానంటూ వెళ్లగా అక్కడే కింద పడుతుంది. అప్పుడే మను దగ్గరకు వచ్చి చేయి అందించి మరీ ఆమెను పైకి లేపుతాడు. కళ్లు ఉన్నవి ముందు చూసుకుని నడవడానికి అంటూ మను అంటాడు. మీకు మీ క్యారెక్టర్ కు ఓ దండం అని చెప్పి.. జీవితంలో నిన్ను కలవనంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వసు రిషిని గుర్తు చేసుకుంటూ కూర్చుంటుంది. తెగ బాధ పడిపోతూ.. ఎప్పుడు వస్తారు సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే మహేంద్ర అటు వైపు వెళ్తూ వసుని చూసి ఆమె వద్దకు వస్తాడు. రిషి గురించేనా అంటూ తను త్వరలోనే వస్తాడని చెబుతాడు. అసలు సార్ వస్తారా.. ఇంతకాలం అయిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది వసు.

Angel Romantic Words to manu on Guppedantha Manasu May 24th 2024 Episode 1083

మనును అంత సులువుగా జైలు నుంచి తీసుకు వచ్చిన మనం.. రిషిని మాత్రం ఇంకా పట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తాడు మహేంద్ర. అప్పుడే శైలేంద్ర వచ్చి రిషి రాడని అంటాడు. దీంతో వసు, మహేంద్రలు కోపంగా చూస్తారు. ఏంటి బాబాయి రిషి వస్తాడు, వస్తాడు అంటారేంటి అనగా.. తను లేడని అంటాడు. ఓ గ్లాస్ చేతిలోకి తీసుకుని ఉంది కదా అని ఆ తర్వాత పడేస్తాడు. ఇప్పుడు ఈ గ్లాస్ లేదు కదా.. ఇప్పుడు రిషి కూడా అంతేనంటూ వివరిస్తాడు. తను లేడు కాబట్టే రాడు అని అంటాడు. మోసం చేసిన వాళ్లకు మంచి జరగదని చెబుతాడు. ఆ తర్వాత రిషి అసలు ఈ ప్రపంచంలోనే లేడని.. రిషి వచ్చినా నేను అంటూ ఆపేస్తాడు. మహేంద్ర కోపంగా దగ్గరకు వచ్చి శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు. చాలా బాగా నటిస్తున్నావని వసును అనగా.. రిషి రాడని మళ్లీ మళ్లీ అంటాడు.

Angel Romantic Words to manu on Guppedantha Manasu May 24th 2024 Episode 1083

మీరు ఇదే ఆవేశంలో ఉంటేనే నేను మిమ్మల్ని దెబ్బ కొట్టగలనని.. శైలేంద్ర చెబుతాడు. వాడికంత సీన్ లేదంటూ మహేంద్ర అనగా వసు మరింత కోప్పడుతుంది. ఆ తర్వాత శైలేంద్ర వసు, మహేంద్రలను బాగానే ఇరిటేట్ చేశాను.. ఇప్పుడు మనుని ఇరిటేట్ చేయాలనుకుంటూ వెళ్తాడు. మను వద్దకు వెళ్లి తన తండ్రి గురించి అడుగుతూ.. మనుకు కోపం తెప్పిస్తాడు. నేను నిన్ను కేసులో ఇరికించానని.. తెలివిగా నన్ను మోసం చేసి, బయటకు వచ్చావు కానీ నాకు మంచే జరిగిందని అంటాడు. ఒకవేళ మా బాబాయి నిన్ను దత్తతు తీసుకుంటే.. నువ్వు నీ కన్నతండ్రి గురించి మర్చిపోయేవాడివి, కానీ నీ తండ్రి గురించి నువ్వు మర్చిపోకూడదనే దత్తత కార్యక్రమం ఆగిపోయినట్లేనంటాడు. అలాగే శైలేంద్ర ఫాదర్ ఆఫ్ ఫణీంద్ర.. మను ఫాదర్ ఆఫ్ హూ అంటూ ప్రశ్నిస్తూనే ఉంటాడు. నేను వరెస్ట్ గాడినే కానీ.. నన్నే మోసం చేసిన మీరు మరెంత వరెస్ట్ అంటూ కోప్పడతాడు.

అది మోసం కాదు.. తెలివిగా దెబ్బ కొట్టడం అంటారు అని మను అనగా.. మరి అదే తెలివి ఉపయోగించి నీ తండ్రి ఎవరో తెలుసుకోవచ్చు కదా అంటాడు. నువ్వేం ఫీల్ అవ్వకు అంటూనే షేక్ హ్యాండ్ ఇవ్వు, హగ్ ఇవ్వు అంటూ హగ్ చేసుకుంటాడు. నీ తండ్రి నిన్ను కొడుకని చెప్పకపోయినా, నీకు బ్రదర్స్ లేడని ఫీల్ అవ్వకు.. నేను నిన్ను నా తమ్ముడిగా దత్తత తీసుకుంటానంటూ వివరిస్తాడు. రిషి లేడు, రాడంటూ అనగానే వసు వచ్చి ఫైర్ అవుతుంది. కానీ శైలేంద్ర ఆపకుండా.. నువ్వు నీ తండ్రి గురించి తెలుసుకో, అదే నీ జీవిత ఆశయం అంటూ మనును మరింత రెచ్చగొడతాడు. ఆపు అంటూ వసు అనగా.. మీరు మీ నటన ఆపండి, నంది అవార్డులు కూడా వస్తాయి మీ నటనకు అంటూ చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత శైలేంద్ర వెళ్లిపోగా.. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X