Guppedantha Manasu వసుధార, రిషి మధ్య ఏంజెల్ క్యాండిల్ లైట్ డిన్నర్ చిచ్చు.. నాపై నీకు ప్రేమ లేదా అంటూ ప్రశ్న!

నీ కోసం ఎదురు చూస్తున్నానంటే.. ఎందుకు అని అడగవా? అని రిషిని ఏంజెల్ అడిగింది. అయితే ఎందుకు అని రిషి అంటే. ఎందుకంటే అని ఏంజెల్ నసిగింది. ఎందుకు ఏంజెల్ అని రుషి అంటే.. కాదు చెప్పేది కాదు. నువ్వు చూస్తూనే బాగుంటుంది అని ఏంజెల్ అంది. అయితే ఏంజెల్ ప్రశ్నలకు జవాబిస్తూ నీవు చెప్పిన బాగుంటుంది అని రిషి అంటే.. లేదు.. నీకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను. రా అంటూ రిషి చేయి పట్టుకొని ఏంజెల్ తీసుకెళ్లింది. దాంతో చేసేది ఏమీ లేక రిషి అయిష్టంగానే ముందుకు వెళ్లాడు.

ఏంజెల్‌కు చెప్పిన ప్లాన్ గురించి వసుధార కంగారుపడిపోయింది. ఏంజెల్‌కు ప్లాన్ చెప్పాను. కానీ మరో అమ్మాయితో రిషి క్యాండిల్ డిన్నర్ చేస్తాడా? అని అనుమానపడింది. అయితే ఏంజెల్‌కు ఫోన్ చేసి విషయం కనుక్కొందామని వసుధార ఫోన్ కలిపింది. అయితే పని మనిషి ఎత్తి.. ఏంజెల్ తన ఫోన్‌ను హాల్‌లో పెట్టి వెళ్లింది. రిషితోపాటు పై గదిలోకి వెళ్లింది అని పనిమనిషి చెప్పింది. దాంతో రిషి, ఏంజెల్ క్యాండిల్ లైట్ డిన్నర్‌ చేస్తున్నారా అంటూ వసుధార ఆలోచనల్లో పడింది.

Angels crush on Rishi at Candle light dinner planned by Vasudhara in 853 episode of Guppedantha Manasu serial

ఏంజెల్ తన ఇంటి టెర్రస్‌పై క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్, ఏర్పాట్లను చూసి. ఏంటి ఇదంతా? ఎందుకు చేశాడు అని రిషి ప్రశ్నించాడు. దాంతో క్యాండిల్ లైట్ డిన్నర్. ఇద్దరం కూర్చొని మనసులో భావాలను పంచుకొంటే.. దగ్గరవుతాం అని ఏంజెల్ అమాయకంగా చెప్పింది. ఈ ప్లాన్ నీకు ఎవరు చెప్పారని రిషి అడిగితే.. ఏంజెల్ మౌనంగా నిలబడింది. వసుధార చెప్పిందా? అంటూ ప్రశ్నిస్తే అవును అన్నట్టు ఏంజెల్ తలూపింది. ఇంత కరెక్ట్‌గా ఎలా గెస్ చేశావని అంటూ.. నాకు తెలుసు అని రిషి వెళ్లిపోతుంటూ.. చేయి పట్టి ఆపి.. ఎందుకు వెళ్లిపోతున్నావంటూ.. అడిగితే.. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు అని కోపంగా రిషి సమాధానం చెప్పాడు. నీ కోసం ఇవన్నీ ఇష్టంగా ఏర్పాటు చేశాను అని ఏంజెల్ ఆవేదన వ్యక్తం చేసింది.

Angels crush on Rishi at Candle light dinner planned by Vasudhara in 853 episode of Guppedantha Manasu serial

అయితే ఏంజెల్‌ను సున్నితంగా హెచ్చరిస్తూ.. ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. అది మనకు మంచింది అని రిషి కోపంగా లుక్ ఇచ్చాడు. ఏంటి రిషి హద్దుల గురించి మాట్లాడుతున్నావు. అర్ధం కాని మాటలు చెప్పి నన్ను అయోమయంలో పెడుతున్నావు. నీ మనసులో ఉన్న మాట చెప్పు రిషి అని ఏంజెల్ అంటే.. ఇప్పడే కాదు.. ఎప్పుడూ చెప్పేది ఒకటే. మన మధ్య పెళ్లి ప్రస్తావన తేవద్దు అని రిషి స్పష్టం చేయగా.. నీకు పెళ్లి ఇష్టం లేదా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని ఏంజెల్ ప్రశ్నించింది. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం అని రిషి అంటే.. ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటావు అని ఏంజెల్ ప్రశ్నించింది.

Angels crush on Rishi at Candle light dinner planned by Vasudhara in 853 episode of Guppedantha Manasu serial

ఏంజెల్ ప్రశ్నలకు జవాబిస్తూ.. మోడుబారిన చెట్టు మళ్లీ చిగురించడం కష్టం అని రిషి అన్నాడు. ఇదంతా వద్దు.. నీవు ఇలా చేస్తే నా మనసు నలిగిపోతుంది. ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని గట్టిగా చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్‌వి. నా ప్రాణాలు కాపాడావు. నేను ఎప్పటికీ ఒంటరిగా ఉండాలని కోరుకొంటున్నాను. నిజాన్ని గ్రహించు అని రిషి తెగేసి చెప్పాడు. దాంతో సరే.. నీవు తినేసి వెళ్లు అని అంటే.. నీవు తిను. నీకు ఎవరైతే ప్లాన్ ఇచ్చారో వారితో తిను అంటూ రిషి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వసుధారను పిలిచి క్లాస్ పీకాడు. క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్స్ ఎందుకు ఇస్తున్నావు? అని రిషి అంటే.. డిన్నర్ చేసి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావా? అంటే.. షటప్ వసుధార.. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి అక్కడ నీవు ఉన్నావా? అంటూ రిషి అరిచాడు. దాంతో వసుధార ఒక్కసారిగా ఆనందం, ఎమోషన్స్ ఊగిపోయింది. దాంతో ఏమన్నారు? నేనైతే మీకు పర్వాలేదా? నాతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి రెడీనా? అని వసుధార గుచ్చి గుచ్చి అడగుతుంటే.. వసుధార అంటూ రిషి గట్టిగా అరిచాడు. నీకు నేనంటే ఇష్టం అందుకే.. ఏంజెల్‌తో డిన్నర్ చేయలేదు. అందుకే నన్ను మేడమ్, వసుధార, నువ్వు అని పిలుస్తుంటావు అని వసుధార అంటే.. అలా నాకు ఫ్లోలో వచ్చేస్తుంటాయి అని వసుధార ప్రశ్నల నుంచి రిషి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు.

Angels crush on Rishi at Candle light dinner planned by Vasudhara in 853 episode of Guppedantha Manasu serial

రిషి ఇచ్చిన షాక్‌తో ఏంజెల్ నేరుగా వసుధార వద్దకు వచ్చింది. నీవు చెప్పిన ప్లాన్స్ బాగున్నాయి. కానీ నేనే సరిగా ఎగ్జిక్యూట్ చేయడం లేదనుకొంటాను అని ఏంజెల్ అంటే.. అది కాదు. వాటికి ఓ సమయం ఉంటుందని చెప్పింది. వర్కవుట్ కావడం లేదని వదలకు. నీ ప్లాన్స్ కంటిన్యూ చేయి అని వసుధార చెప్పింది. నీవు ప్రేమలో లేకపోయినా నీకు చాలా విషయాలు తెలుసు. నీవు చెప్పిన ప్లాన్స్ కొనసాగిస్తాను అని ఏంజెల్ చెప్పింది. అయితే నేను ఇచ్చే ప్లాన్ నీ కోసం.. కాదు.. నా కోసం.. రిషి మనసులో నేను ఉన్నానని చెప్పించడానికి అంటూ వసుధార మనసులో అనుకొన్నది.

రిషి గురించి ఆలోచన్లలో ఉన్న వసుధారకు జగతి, మహేంద్ర ఫోన్ చేశారు. అంతా బాగానే ఉందా? అని అడిగితే.. అవును అంతా బాగానే ఉంది అని వసుధార సమాధానం ఇచ్చింది. అంతలోనే రిషి వచ్చి ఫోన్ తీసుకొని.. అంతా చెప్పేస్తున్నావా? అని అంటే.. నేను మాట్లాడేది జగతితో కాదు.. మహేంద్రతో.. మిషన్ ఎడ్యుకేషన్ విషయాలు మాట్లాడుతున్నాను అని సమాధానం చెప్పింది. అయితే ఏంజెల్ విషయాలు కూడా చెప్పేశావా? అంటే.. నాకు గానీ, మా గురువు మహేంద్రకు అలాంటి విషయాలు చెప్పడం అలవాటు లేదు. కొన్ని కుశల ప్రశ్నలు కూడా అడిగితే జవాబు చెప్పాను అని వసుధార చెప్పింది. అయితే ఏంజెల్‌కు ఎందుకు ప్లాన్స్ ఇస్తున్నావు అంటే.. సాయం అడిగింది.. నేను సాయం చేస్తున్నాను అని వసుధార చెప్పింది. అయితే ఇంకా ఎన్నాళ్లు ఇలా కోపం చూపుతావు. నాపై ప్రేమ కురిపిచవా? అంటూ వసుధార మనసులో అనుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X