అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి.. : టీవీ యాంకర్ ఝాన్సీ

నిధి, వైజయంతి, త్రిష... ముగ్గురూ మంచి స్నేహితులు. వాళ్లల్లో ఒకొక్కరిదీ ఒక్కో కల. అవి కూడా చాలా పెద్దవి. మరి వాటిని నెరవేర్చుకొనేందుకు కలిసికట్టుగా ఏం చేశారో 'ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్'లో చూడాలి. ఈ ఆంగ్ల చిత్రానికి శీతల్ మొర్జారీయా దర్శకత్వం వహించారు. సంపద హర్కారా, సాగరి వెంకట, అయాంత మిచెల్ ప్రధాన పాత్రధారులు. బుల్లి తెర వ్యాఖ్యాత ఝాన్సీ లక్ష్మి, రేఖ పప్పు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర దర్శకురాలు మాట్లాడుతూ ''ముగ్గురు యువతుల జీవితాల్లోని ఆశలు, ఆకాంక్షలు, అనుభూతుల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇలాంటి కథను నేనిప్పటి వరకూ చూడలేదు. ఇది అమ్మాయిల కథే అయినా.. అందరికీ నచ్చేలా ఉంటుంది''అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''సినిమా తీయడమే కాకుండా.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో కూడా నిర్మాతకు తగిన ప్రణాళికలు ఉండాలి'' అన్నారు.
ఝాన్సీ మాట్లాడుతూ''డబ్బుతో పూర్తయిన సినిమా కాదిది. దీని వెనక ఎంతో మంది తపన, సహకారం ఉంది. పాన్ ఇండియా, పీవీఆర్ సంస్థల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది''అన్నారు ఝాన్సీ. అలాగే 'ఇంత వరకూ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ డీల్ చేయలేదు. ఈ సినిమాలో మూడు పాత్రలే ఉంటాయి. ముగ్గురు అమ్మాయిలు, వారి స్నేహం, తమ సమస్యల పరిష్కారం నేపథ్యంలో చాలా బోల్డ్ నేచర్‌లో ఈచిత్రం చేసాం. దేశ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శోభన ఎన్. రావు. ఇప్పటికే ఈచిత్రం గోవాలో జరిగిన సౌత్ ఏషియల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


Click it and Unblock the Notifications











