Bigg Boss NonStop: పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్.. మోడలింగ్ చేస్తూ సినిమాల్లో కూడా.. ఏయే సినిమాలు చేశాడంటే?
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ నాన్‌స్టాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే రెండు టీములు గా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఉంటారు అని నాగార్జున ప్రకటించారు. గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్ లు వారియర్స్ గా, కొత్తగా వచ్చే వారు చాలెంజర్స్ గా పిలవబడతారు అంటూ నాగార్జున ప్రకటించారు. ఈ సీజన్లో పదవ కంటెస్టెంట్ గా అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఆయన ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పదో కంటెస్టెంట్‌గా
ఈ బిగ్ బాస్ నాన్‌స్టాప్ లో ఫస్ట్ కంటెస్టెంట్ అషు రెడ్డి, సెకండ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా, మూడో కంటెస్టెంట్.. ముమైత్ ఖాన్, నాలుగో కంటెస్టెంట్‌గా అజయ్ కుమార్ కథ్వురార్, ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చొక్కారపు, ఇక ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ, ఏడో కంటెస్టెంట్‌గా అరియానా గ్లోరి, ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్, తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీ రాపాక, పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు.

కొన్ని సినిమాలు చేసినా
అనిల్ రాథోడ్ పోలీస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీలో జన్మించారు. మోడలింగ్ మీద ఆసక్తితో ఆ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి అటు ఉంచి నటన మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలుగులో ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల ద్వారా ఆయనకు పెద్దగా పేరు రాలేదు ఈ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత పేరు వస్తుందని ఆయన భావిస్తున్నాడు.

మోడలింగ్ లో ప్రవేశించి
హైదరాబాద్ కి చెందిన అనిల్ రాథోడ్ ముందుగా మోడలింగ్ లో ప్రవేశించి మంచి విజయాలు అందుకున్నారు. అనేక అవార్డులు సాధించిన తర్వాత నటన మీద ఆసక్తి కలగడం తన సినీ రంగ ప్రవేశం చేశారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన TAA ద్వారా బెస్ట్ మోడల్ ఆఫ్ ది ఇయర్, మిస్టర్ తెలంగాణ 2015 మరియు బెస్ట్ మోడల్ - రుబారు మిస్టర్ ఇండియా 2021 వంటి అనేక అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

మోడల్ గా అవార్డులు
ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ గోవా, బ్రైడల్ ఫ్యాషన్ వీక్, పూణే ఫ్యాషన్ వీక్ మరియు గ్లామ్ ఫ్యాషన్ వీక్ వంటి సర్వల్స్ బ్రాండ్‌లు మరియు అంతర్జాతీయ షోల కోసం అనిల్ ర్యాంప్ వాక్ చేశారు. 2019లో, అనిల్ తన నటనా జీవితాన్ని "Mr.మజ్ను" చిత్రం ద్వారా ప్రారంభించారు. అదే ఏడాది "వెంకీ మామ" చిత్రంలో కూడా నటించారు.

నటుడిగా
అయితే ఆ సినిమాలలో చేసినవి చిన్న పాత్రలు కావడంతో అసలు గుర్తింపు దక్కలేదు. ఇక 2022లో, అనిల్ "సుగ్రీవ" మరియు "అరే ఓ సాంబ" సినిమాలు చేస్తున్నాడు. అనిల్ రాథోడ్ ఎంట్రీ తరువాత నాగార్జున ఒక టాస్క్ కూడా ఇచ్చారు. అక్కడ కొన్ని లిప్ మర్క్స్ ఉన్న హార్ట్ షేప్ కార్డ్ బోర్డులు పెట్టి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు నాగార్జున.. ఒకటి సెలక్ట్ చేసుకున్న తర్వాత హౌస్ లో ఉన్న వారిలో ఒకరి లిప్ మార్క్ అది ఎవరిదో కనిపెట్టాలని చెప్పాడు నాగార్జున.


Click it and Unblock the Notifications











