సుడిగాలి సుధీర్ పై కావాలనే చీప్ కామెంట్స్.. బయట పెట్టిన టాప్ డైరెక్టర్
తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకున్నారు సుడిగాలి సుధీర్. తొలుత జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కామెడీ ఆర్టిస్ట్ గా కొన్నాళ్ల పాటు బుల్లితెరపై సందడి చేసి, తన టాలెంట్ తో క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. ఆ తర్వాత బుల్లితెర స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ క్రేజ్ తో హీరోగా మారి సినిమాలు కూడా చేశారు. ప్రస్తుతం మళ్లీ టీవీ షోల్లో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ పై అతిగా పంచులు పేలడం కొన్నాళ్లుగా సందేహాలకు దారి తీస్తోంది. వెండితెరపై హీరోగా నటించిన అతనికి బుల్లితెరపై మినిమమ్ రెస్పెక్ట్ దక్కడం లేదని ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతూనే ఉన్నారు. దీనిపై తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
బుల్లితెరపై సెన్సేషనల్ స్టార్ గా..
జబర్దస్త్ కామెడీ షోతో సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే. తొలుత వేణు వండర్స్ టీమ్ ద్వారా షోకు ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్ గా అలరించాడు. కొన్ని వందల ఎపిసోడ్స్ తర్వాత టీమ్ లీడర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత హిలేరియస్ కామెడీ స్కిట్స్ తో బుల్లితెరపై సెన్సేషన్ గా మారారు. జబర్దస్త్ షోతో పాటు, ఢీ జోడీ, ఢీ, పోవే పోరా, డ్రామా జూనియర్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ సింగర్ జూనియర్స్, కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ వంటి టీవీ షోలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సర్కార్ సీజన్ 4 షోతో అలరిస్తూనే ఉన్నారు.

సుడిగాలి సుధీర్ పై అనిల్ రావిపూడి పంచులు..
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ స్టార్ ఎదిగాడు గొప్ప విషయం. స్ట్రీట్ మ్యాజిక్ చేసుకునే స్థాయి నుంచి తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారడమంటే అంత సులువైన పనికాదు. అయితే ఆయన టాలెంట్, నేర్పు, ఓర్పుతో ఇంత ముందుకు వచ్చారు. అదేవిధంగా వెండితెరపైనా హీరోగా పలు చిత్రాల్లో మెరిశారు. హీరోగా మారిన తర్వాత కాస్తా ఆయనకు ఇచ్చే గౌరవం మారడం అనేది సహజం. కానీ సుడిగాలి సుధీర్ విషయంలో అది జరగలేదు. పైగా మునుపటి కంటే డోస్ పెంచి ఆయనపై కామెంట్లు, కొన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పంచులు వేస్తున్నారు. ఇక ఆ మధ్యలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సైటెర్స్ వేశారు. ఇక సుడిగాలి సుధీర్ పై తను వేసిన కొన్ని ఇబ్బందికరమైన పంచులపై తాజాగా స్పందించారు.
క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..
రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడారు. వీరిద్దరు కలిసి డ్రామా జూనియర్స్, కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ వంటి టీవీ షోలకు పనిచేశారు. ఆ సమయంలో జడ్జీ హోదాలో ఉన్న అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ పై కొన్ని చీప్ పంచులు పేల్చారు. అయితే ఆ విషయంలో తాను కూడా ఎంతో బాధపడ్డానని అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చారు. జనాలు అతనిపై పంచులు వేస్తే ఎంజాయ్ చేస్తారని, అందుకే రైటింగ్ టీమ్ కొన్ని పంచులు రాసిచ్చేదని, తన సొంత మాటలు కాదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
వాళ్లు ఇచ్చినప్పటికీ కొన్ని అస్సలు వాడేవాడిని కాదని, సుధీర్ కు గౌరవం ఇచ్చేవాడినని చెప్పారు. అయితే కేవలం ఎంటర్ టైన్ మెంట్ పర్పస్ కావడంతో సరదాగా తీసుకునే వాళ్లమని, సుధీర్ కూడా నేను అనడానికి ఇబ్బంది పడితే పర్లేదని చెప్పేవాడని అన్నారు. ఇక సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని వెండితెరపై వరుస చిత్రాలతో చూడాలని, ఆయనకు మంచి సక్సెస్ అందాలని, గౌరవం పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











