హాట్ హాట్‌గా ఉదయ్ కిరణ్ హీరోయిన్.. విహారయాత్రలో భర్తతో కలిసి..

హీరోయిన్ అనిత అంటే టాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడుతారు. ఎందుకంటే ఆమె నటించిన చిత్రాల అంత ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో అనితా హస్సానందానీగా పాపులరైన ఈమె తెలుగులో నువ్వు నేను, శ్రీరాం, నేనున్నాను, ఆడంటే అదో టైపు చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా చేరుకొంటుందా అనేంత క్రేజ్ సంపాదించింది. స్వర్గీయ ఉదయ్ కిరణ్‌తో పలు చిత్రాల్లో నటించింది. అయితే అదే ఊపును కొనసాగించలేక తెలుగు దూరమై హిందీ టెలివిజన్ రంగంపై భారీ అవకాశాలను చేజిక్కించుకొంటున్నది. తాజాగా ఆమె తన భర్త రోహిత్ రెడ్డితో వియత్నాంలో వెకేషన్‌లో సందడి చేయగా.. ఆ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా

స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా

వేసవి తాపాన్ని తట్టుకోలేక అనిత, రోహిత్ రెడ్డి వియత్నాంలో కూల్ కూల్‌గా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి హాట్ హాట్‌గా ఫొటోలకు ఫొజిచ్చారు. ఈ ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విస్త‌‌ృతంగా ప్రచారం అవుతున్నాయి.

 నాగిన్ 3 షోలో క్రేజీగా

నాగిన్ 3 షోలో క్రేజీగా

ప్రస్తుతం అనిత జాతీయ టెలివిజన్ ఛానెల్ నిర్వహించే సూపర్ నేచురల్ షో నాగిన్ 3 షూటింగ్‌ను పూర్తి చేసుకొన్నది. ఆ షూటింగ్ బడలిక నుంచి సేద తీరేందుకు భర్తతో కలిసి వియత్నాంకు వెళ్లింది. కండలు తిరిగిన భర్త రోహిత్ చేతిలో అనిత బందీయై కనిపించింది.

రోహిత్ రెడ్డితో వివాహం

రోహిత్ రెడ్డితో వివాహం

అనిత, గోవాకు చెందిన రోహిత్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. 2013లో జరిగిన వీరి వివాహం ఇండస్ట్రీ వర్గాలను షాక్ గురిచేసింది. అయితే పెళ్లి జరిగి దాదాపు ఆరేళ్లు గడిచినా వారిద్దరూ కొత్త ప్రేమికులం అన్నట్టు కనిపిస్తారు. హాట్ హాట్‌గా దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేస్తారు.

నేను ప్రేమలో ఎలా పడ్డానంటే

నేను ప్రేమలో ఎలా పడ్డానంటే

అనిత‌తో ప్రేమలో పడటం గురించి రోహిత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అనితను తొలిసారి జిమ్‌లో, ఆ తర్వాత పబ్‌లో చూశాడట. ఆ సమయంలో అనిత సినీ తార అని తెలియదట. ఆ తర్వాత ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారట.

ఫేస్‌బుక్ నుంచి మ్యారేజ్ వరకు

ఫేస్‌బుక్ నుంచి మ్యారేజ్ వరకు

ఫేస్‌బుక్ నుంచి వారి పరిచయం పెరిగి కామన్ ఫ్రెండ్స్ ద్వారా దగ్గరై ప్రేమలో పడ్డారట. చాలా కాలం డేటింగ్ చేసిన వీరిద్దరు 2013లో వివాహం చేసుకొన్నారు. రోహిత్‌ కండలు చూసే పెళ్లి చేసుకొన్నానని అనిత ఓ సందర్భంలో వెల్లడించింది.

ప్రతీ రోజు ఐ లవ్ యూ

ప్రతీ రోజు ఐ లవ్ యూ

పెళ్లి తర్వాత రోహిత్, అనిత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైవాహిక జీవితం ఆనందంగా గడవడానికి కారణాన్ని వెల్లడించారు. ప్రతీ రోజు మేమిద్దరం ఐ లవ్ యూ చెప్పుకొంటాం. మేమిద్దరం ఇంట్లో గొడవ పడినా ఐ లవ్ యూ అని చెప్పుకొనే విధానాన్ని మరిచిపొం. ఒకవేళ మాట్లాడుకోకపోతే ఎస్ఎంఎస్ పంపుకొంటాం వారు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X