twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ శుక్రవారం టీవీలో వేసేస్తున్నారు...ఎంజాయ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అంజలి, శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి'. ఈ చిత్రం రెండు నెలల క్రితం విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం టీవీలో ప్రసారం కానుంది. జీ తెలుగులో అక్టోబర్ 19న సాయింత్రం ఆరున్ర గంటలకు టెలీకాస్ట్ కానుంది. హర్రర్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం టీవీల్లోనూ మంచి రేటింగ్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. జీ టీవీ వారు ఈ చిత్రాన్ని మంచి ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు.

    కథలోకి వెళితే...సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు శ్రీనివాసరెడ్డి. దిల్ రాజుకు కథ చెప్పి ఎలాగైన అవకాశం దక్కించుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో స్మశానం పక్కన ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డితో పాటు సత్యం, రాజేష్, జబర్దస్త్ శంకర్ కూడా అదే ఇంట్లో దిగుతారు. గతంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి(అంజలి) దయ్యంగా మారి తిరుగూ ఉంటుంది. మరి దయ్యం కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి తన లక్ష్య సాధనకు ఏం చేసాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

     Anjali's Geetanjali on small screen

    అంజలి తర్వాత శ్రీనివాసరెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే అనిపించుకున్నాడు. సైతాన్ రాజ్ పాత్రలో బ్రహ్మానందం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టెన్ చేసారు. సత్యం రాజేష్, జబర్దస్త్ శంకర్ కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంది. రావు రమేష్ కీలకమైన పాత్రలో తనదైన నటన కనబరిచాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. దిల్ రాజు తొలిసారిగా ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో తెరపై కనిపించారు.

    మిగతా ముఖ్య పాత్రల్లో ...అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, ఝాన్సీ, రావూరమేష్, హర్షవర్థన్ రాణె, వెనె్నల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీజో, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, మాటలు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్.

    English summary
    Anjali's horror entertainer ‘Gitanjali’ is all set to entertain on small screen on Zee TV at 6 PM on 19th, October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X