'క్రైమ్ వాచ్' హర్షవర్దన్‌పై మరో కేసు
ఏలూరు : మొన్నీ మధ్యన అరెస్టైన టీవీ యాంకర్ (క్రైమ్ వాచ్)హర్షవర్దన్‌పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. విజయవాడకు చెందిన రైల్వే ఇంజనీర్‌ను బెదిరించి రూ.11 లక్షలు వసూలు చేశాడని హర్షన్‌వర్దన్‌పై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్లాక్‌మెయిలింగ్ కేసులో అరెస్ట్ అయిన టీవీ యాంకర్ హర్షవర్దన్, మరో నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో సోమవారం వారిని ఏలూరులోని సబ్‌జైలుకు తరలించారు. వీరిని విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వీరి అరాచకాలు చాలానే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. తామూ వారి బెదింపులకు లొంగి డబ్బులు పోగొట్టుకున్నామంటూ కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని, వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లోతుగా పరిశోధన చేస్తే ఇంకెన్నో చీకటికోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఇంతవరకూ ఇలా ఎంతమందిని బెదిరించా రు. ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డారా? వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు. ఎవరెవరు సహరిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











