twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బిగ్ బాస్’లోకి ఆయనను తీసుకోవడంపై రచ్చ.. ఏకిపారేస్తున్నారుగా..!

    |

    'బిగ్ బాస్' మొదట ఉత్తరాదిలో పరిచయం అయిన ఈ షో.. క్రమంగా దక్షిణాదికి పాకింది. తెలుగు సహా పలు భాషల్లోనూ ప్రారంభమైంది. మిగిలిన వాటిని మినహాయిస్తే.. మన దగ్గర ఈ షో భారీ స్పందనను అందుకుంది. ఇప్పటికే రెండు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నో వివాదాలు ఈ రియాలిటీ షోను చుట్టుముట్టాయి. అయినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా 'బిగ్ బాస్' నిర్వహకులు ముందుకు వెళ్తున్నారు.

    వివాదాల నడుమ ప్రారంభం

    వివాదాల నడుమ ప్రారంభం

    ఎన్నో వివాదాలు.. మరెన్నో అనుమానాల మధ్య ‘బిగ్ బాస్' తెలుగు సీజన్ - 3 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. షో హోస్ట్ అక్కినేని నాగార్జున తనదైన శైలితో ప్రవేశించారు. ఆ తర్వాత హౌస్ మొత్తం పరిశీలించారు. అనంతరం ‘బిగ్ బాస్' ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ సీజన్‌లో పదిహేను మంది కంటెస్టెంట్‌లను లోపలికి పంపించారు.

    నాగ్‌కు మంచి మార్కులు

    నాగ్‌కు మంచి మార్కులు

    అక్కినేని నాగార్జునను హోస్టుగా మంచి మార్కులే కొట్టేశారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షోను హోస్ట్ చేసిన అనుభవం ఉండడంతో ఆయన ఇక్కడ కూడా ఆకట్టుకోగలిగారు. కంటెస్టెంట్‌లను ఆహ్వానించడం.. వారితో సరదాగా మాట్లాడడం.. తర్వాత వారిని లోపలికి పంపించడం వంటివి చేశారు. మరి, మిగిలిన ఎపిసోడ్స్‌లో ఎలా నెట్టుకు వస్తారో చూడాలి.

    తమిళ కంటెస్టెంట్

    తమిళ కంటెస్టెంట్

    తెలుగు ‘బిగ్ బాస్' షోలో తమిళనాడుకు చెందిన సెలెబ్రిటీని తీసుకున్నారు. అది ఎవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్. ఈటీవీలో ప్రసారమైన డీ డాన్స్ షోతో బాగా ఫేమస్ అయ్యారు. చిరంజీవి మొదలుకొని రామ్ చరణ్ వరకు అందరికీ కొరియోగ్రఫీ అందించారు. నందమూరి హీరోలకు సైతం ఈయన అందించిన కొరియోగ్రఫీ బాగా కలిసొచ్చింది. ఈ మధ్యనే దర్శకుడి అవతరమెత్తి తమిళ్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

    తెలుగు వాళ్లు లేరా?

    తెలుగు వాళ్లు లేరా?

    తెలుగు షోలో తమిళ సెలెబ్రిటీని తీసుకోవడం పట్ల ‘బిగ్ బాస్' నిర్వహకులపై విమర్శలు వస్తున్నాయి. తెలుగులో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉండగా.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ రియాలిటీ షోలో మరో రచ్చ మొదలైంది.

    మరోవైపు వివాదాలు

    మరోవైపు వివాదాలు

    ‘బిగ్ బాస్' షోను నిషేదించాలంటూ డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వీరికి ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఓయూ విద్యార్థులు సైతం నాగార్జున ఇంటిని ముట్టడించారు.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started In Sunday. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X