జబర్ధస్త్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇకపై ఒక్క రోజు మాత్రమే.. ఏది లేపేస్తారబ్బా.!

By Manoj

'జబర్ధస్'.. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ప్రసారం అయ్యే ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాదు, చాలా మంది ఆర్టిస్టులు సెలెబ్రిటీలు అయిపోయారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తోన్న 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా చాలా మంది గురు, శుక్రవారాల్లో ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఈ కామెడీ షో ప్రభావం చూపిస్తోంది. అయితే, తాజాగా ఈ షోలో జరిగిన పరిణామాలు కలకలం రేపుతున్నాయి. అలాగే, జబర్ధస్త్ మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

 నాగబాబు మాత్రమే కాదు.. వాళ్లు కూడా

నాగబాబు మాత్రమే కాదు.. వాళ్లు కూడా

సక్సెస్‌ఫుల్ షో జబర్ధస్త్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ షో నుంచి దర్శకులు నితిన్, భరత్‌తో పాటు జడ్జ్ నాగబాబు, టీమ్ లీడర్లు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర సహా పలువురు బయటకు వెళ్లిపోయారనేదే ఆ వార్త సారాంశం. అయితే, మరో జడ్జ్ రోజా మాత్రం తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారని తెలుస్తోంది.

ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు

ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు

జబర్ధస్త్‌కు మూల స్థంభంగా ఉన్న నాగబాబుతో పాటు ముఖ్యమైన టీమ్ లీడర్లు, డైరెక్టర్లు బయటకు వెళ్లిపోయారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, షో నిర్వహకులకు డైరెక్టర్లకు మధ్య గొడవలు అయ్యాయని కొందరు అంటుండగా.. నాగబాబుతో నిర్వహకులకు వివాదం చెలరేగిందని మరికొందరు అంటున్నారు. దీనిపై మాత్రం క్లారిటీ లేదు.

అందరూ కలిసి అక్కడ మొదలెట్టారు

అందరూ కలిసి అక్కడ మొదలెట్టారు

జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయిన వారందరూ కలిసి మరో ప్రముఖ చానెల్‌లో సరికొత్త షో స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడంతో జబర్ధస్త్ షో మనుగడ ప్రశ్నార్ధకం కాబోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు

క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు

జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయారన్న వార్తలపై నాగబాబు ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. ‘2013 నుంచి ‘జబర్దస్త్‌'తో నా ప్రయాణం కొనసాగింది. ఇది మరిచిపోలేనిది. నాకు నేనుగా ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. సృజనాత్మక విభేదాల వల్లే బయటకు రావాల్సి వచ్చింది. దీంట్లో ఎవరి తప్పూ లేదు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు. రెమ్యూనరేషన్ వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదు' అని ఆయన వెల్లడించారు.

 మరో షాకింగ్ న్యూస్

మరో షాకింగ్ న్యూస్

ప్రస్తుతం జబర్ధస్త్ షోలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇకపై వారంలో ఒకరోజు మాత్రమే ఈ షో ప్రసారం అవుతుందనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటి వరకు జబర్థస్త్ పేరిట గురవారం, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ పేరిట శుక్రవారం ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పుడు చాలా మంది టీమ్ లీడర్లు ఈ షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో వారంలో ఒక రోజు మాత్రమే ప్రసారం చేయాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
రెండింటిలో ఏది లేపేస్తారు..?

రెండింటిలో ఏది లేపేస్తారు..?

ప్రస్తుతం ప్రసారం అవుతున్న ‘జబర్థస్త్', ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్'లో దేనిని లేపేస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. దీంతో ఈ షో గురించి బుల్లితెర ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు, రెండింటిలో ఒకటి కచ్చితంగా తీసేస్తారని కొందరు అంటుండగా, లేదు.. కొత్త వారిని పెట్టి మేనేజ్ చేస్తారని మరికొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X