twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    bigg boss 5: ఎంత ఆఫర్ చేస్తున్నా కూడా టెంప్ట్ అవ్వని సెలబ్రెటీలు.. నో చెప్పిన మరో ఇద్దరు స్టార్స్!

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సౌత్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో తెలుగులో ఈ షో హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు అయితే చాలానే వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ ద్వారా ఒక మంచి ట్రాక్ అయితే సెట్ చేశాడు. ఇక ఆ తర్వాత నాని ఒక సీజన్ కు హోస్ట్ చేసి ఒత్తిడి తట్టుకోలేక వెనుకడుగు వేశాడు. అనంతరం నాగార్జున హోస్టింగ్ చేసిన విధానం అందరికి కనెక్ట్ అయ్యింది. ఎంతో బ్యాలెన్స్ తో తన ఇమేజ్ పై ఏ మాత్రం మరక పడకుండా కంటెస్టెంట్స్ ను కంట్రోల్ చేస్తూ వచ్చారు.

    అందుకే నాగార్జున ఫిక్స్..

    అందుకే నాగార్జున ఫిక్స్..

    బిగ్ బాస్ సీజన్ 3 అలాగే 4కు భారీ స్థాయిలో రేటింగ్స్ రావడానికి నాగార్జున ఎంతగానో హెల్ప్ అయ్యారు. అందుకే నాగార్జునను ఐదో సీజన్ కు కూడా హోస్ట్ గా ఫిక్స్ చేశారు. సీజన్ 5కు సంబంధించిన కొన్ని ప్రోమోలను ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి ఆ ప్రోమోలతో అయితే నాగార్జున మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక షోలో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు పాల్గొంటారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది.

    రెండు వారాల ముందే..

    రెండు వారాల ముందే..

    ప్రస్తుతం 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎంతమంది హౌస్ లోకి వెళ్తారు అనేది ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం దాదాపు కంటెస్టెంట్స్ లిస్టును ఫైనల్ చేసినట్లు అయితే టాక్ వస్తోంది. ఇక ఈ రియాలిటీ షో మొదలయ్యే రెండు వారాల ముందే కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లోకి తరలించనున్నట్లు ఇటీవల ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. ఇక అందులో ఎవరెవరు ఉన్నారు అనేది షో మొదలైతే గానీ తెలియదు.

    సింగర్ మంగ్లీ, యాంకర్ వర్షిని..

    సింగర్ మంగ్లీ, యాంకర్ వర్షిని..

    ఇటీవల ప్రకటించిన ఒక లిస్టు అయితే సింగర్ మంగ్లీ తో పాటు, వర్షిని పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే వీరు ఇద్దరు కూడా బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంగ్లీ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది. ఆమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

    ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పాడుతున్న పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.. కాబట్టి వారికి బిగ్ బాస్ తో అవసరం లేదు. యాంకర్ వర్షిని కూడా కొన్ని రియాలిటీ షోలకు ముందే ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇతర షోలకు వెళ్లే అవకాశం లేకపోయింది.

    అడిగినంత పారితోషికం..

    అడిగినంత పారితోషికం..

    దీని బట్టి ఈ ఇద్దరు కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే అవకాశం లేదని అర్థమైంది. ఇక ఇతర లిస్ట్ లోకి వెళితే అందులో యూ ట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖ వాణి కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ సెలబ్రిటీలు నిత్యం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బిజీగా ఉండేవారు కాబట్టి వారు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి స్టార్ మా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుందని సమాచారం.

    English summary
    Big demand for bigg boss 5 telugu top contestants solid remunerations. The names of Shanmuk Jashwant and Anchor Ravi have already been heard for Bigg Boss 5. Talk is coming that a glamorous heroine is also coming as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X