Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బిగ్ బాస్4 బ్రేకింగ్: హౌజ్‌లోకి మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రేపే రాబోతోందట
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నిర్వాహకులు మొత్తానికి షోను ఒక ట్రాక్ లోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త టాస్క్ లతో జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా సరికొత్త కిక్కిస్తున్నాయి. ఇప్పటికే కుమార్ సాయి, ముక్కు అవినాష్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి మరింత బజ్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఆమె రేపే హౌజ్ లోకి అడుగు పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం.
Recommended Video
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు
మొదట హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రెటీలు పెద్దగా సర్ ప్రైజ్ ఏమి చేయలేదు. కరోనా వైరస్ కారణంగా టీవీలకు బాగా అలవాటు పడిన జనాలకు ఇప్పుడు బిగ్ బాస్ అనగానే స్పెషల్ ఫోకస్ ఉంటుందని అనుకున్నారో ఏమో గాని తక్కువ ఖర్చులోనే కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కొందరికైతే రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట. తక్కువ ఖర్చుతో రేటింగ్ ద్వారా ఎక్కువ లాభాలు అందుకోవాలని బిగ్ బాస్ నిర్వహకులు వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది.
మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్..
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక హాట్ బ్యూటీ హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.స్వాతి దీక్షిత్. 27 ఏళ్ల ఈ నటి మొదట టీవీలలో కొన్ని షోల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అనంతరం బెంగాలీలో హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె అల్లరి నరేష్ జంప్ జిలాని అనే సినిమా ద్వారా పరిచయమైంది.
బిగ్ బాస్ లోకి రావడానికి కారణం..?
అలాగే అంజలి చిత్రంగాధ సినిమాలో కూడా నటించింది. ఇక తమిళ్ , మలయాళం అని తేడా లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీకి ఇంకా అనుకున్నంతగా బ్రేక్ రావడం లేదు. అందుకే బిగ్ బాస్ ద్వారా తన రేంజ్ ని పెంచుకోవాలని చూస్తోంది. గురువారం ఆమె మూడవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
గంగవ్వ పై స్పెషల్ ఫోకస్
ఇక ఈ వారం కాకపోయినా మరొక వారంలోనైనా గంగవ్వ ఎలిమినెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు రూమర్స్ చాలానే వస్తున్నాయి. కానీ ఆడియెన్స్ నుంచి రోజురోజుకి గంగవ్వకు భారీ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. కొన్నిరోజుల క్రితం ఆమె తన ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన చెందడంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ఇక ఆమెకు సరైన వైద్యం అందించడంతో గంగవ్వ మళ్ళీ ముందులాగే హై ఎనర్జీతో కనిపించింది. ఇక ఆమెను మరో మూడు వారాల పాటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.