బిగ్‌బాస్‌లో ముసలోడి ప్రేమకు ముప్పు.. జస్లీన్ కోసం క్యూ కడుతున్న సెలబ్రిటీలు.. ఒంటిపై టాటూల లెక్క!
హిందీ బిగ్‌బాస్ సీజన్ 12లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. 63 ఏళ్ల అనూప్ జలోటా 27 ఏళ్ల తన ప్రియురాలు జస్లీన్‌తో బిగ్‌బాస్ ఇంట్లోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారి జంట గురించి ఇంట్లోనే కాకుండా ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. జస్లీన్ అందానికి ఇంటి సభ్యులు ఫిదా కావడంతో అనూప్ జలోటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. గత వారం రోజులుగా ఇంట్లో జస్లీన్‌కు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇంతకీ ఏం జరుగుతున్నదంటే..
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

జస్లీన్‌పై మనసు పారేసుకొంటున్న
బిగ్‌బాస్ 12 ప్రారంభమై కేవలం 10 రోజులు మాత్రమే అయింది. కానీ అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. గ్లామర్ డాల్ జస్లీన్‌పై ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా జస్లీన్ ఫ్యాన్ క్లబ్బులో శివాషీస్ చేరిపోయాడు. ఇంట్లో జస్లీన్ గురించి ముచ్చట్లు బాగా జరుగుతున్నాయి.

జస్లీన్ ఒంటిపై టాటూల లెక్కింపు
కొద్దిరోజుల క్రితం ప్రసారమైన ఎపిసోడ్‌కు సంబంధించిన అన్ సీన్‌లో ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. బాత్రూంలో జరిగిన చర్చలో జస్లీన్ మనసు పాడేసుకొన్నారు. జస్లీన్ ఒంటిపై ఎన్నీ టాటూలు ఉన్నాయి అనే చర్చను శివాషీస్ లేవనెత్తాడు. అక్కడే ఉన్న జస్లీన్ సమాధానం ఇస్తూ నా ఒంటిపై 13 టాటూలు ఉన్నాయని చెప్పింది.

ఒంటిపై టాటాలను వెతికిన కంటెస్టెంట్
జస్లీన్ ఒంటిపై టాటూలు వెతకడం ఈ చర్చలో ఆసక్తికరంగా మారింది. వెంటనే మరో కంటెస్టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగింది. అప్పుడు శివాషీస్ అనే కంటెస్టెంట్ ఆమె ఒంటి మీద వెతకడం ప్రారంభించగా జస్లీన్ అడ్డుకొన్నది. నా ఒంటి మీద ఉన్న టాటూలన్నీ స్వయంగా నేను వేసుకొన్నానని చెప్పింది.

జస్లీన్‌పై దీపక్ ఠాకూర్ ఫిదా
ఇప్పటికే దీపక్ ఠాకూర్ అనే కంటెస్టెంట్ జస్లీన్ ఆకర్షణకు గురయ్యాడు. ఆమె అందాన్ని ఆయన పొగడ్తలతో ముంచెత్తాడు. మేకప్ లేకుండానే చాలా అందంగా ఉంటుంది. ఆమెకు మేకప్ అవసరం లేదు అని అనగానే జస్లీన్ బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.

అనూప్ జలోటాకు ముప్పు
బిగ్‌బాస్ 12 షో మొదట్లోనే ఇలా ఉంటే, రానున్న రోజుల్లో జస్లీన్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో అనే మాట వినిపిస్తున్నది. జస్లీన్ వ్యవహారం అనూప్ జలోటాకు ముప్పు తెచ్చే ప్రమాదం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











