Guppedantha Manasu May 29th: అనుపమ కన్నతల్లి కాదు.. మనును పెంచిన తల్లి.. నిజం తెలుసుకున్న మహేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఏంజెల్ మనుకు కన్ను కొడుతుంది. అది వసు కూడా చూస్తుంది. అప్పుడే మను ఏం చేస్తున్నావని అడగ్గా.. నేనా ఫోన్ చూస్తున్నానంటూ ఏంజెల్ చెబుతుంది. నన్ను చూసి ఏదో చేశావు కదా ఆ పని ఏంటని ప్రశ్నిస్తాడు. చెప్పు నేనేం చేశానో.. ఏం చెప్పలేవా, అయితే వదిలెయ్ అంటూ అంటుంది. అసలు నీకేం కావాలి అంటూ మను అనగా.. మనసు అంటుంది ఏంజెల్. అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావని అనగా.. నువ్వే మా జీవితాల్లోకి వచ్చావంటూ ఏంజెల్ చెప్పుకొస్తుంది. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం అయిందని, కానీ ఎవరికీ నా జీవితంలో చోటు లేదని చెబుతాడు. వెళ్లిపోమనగా.. సరేనని ఏంజెల్ బపయటకు వెళ్తుంది.

వసు అదంతా చూడగా.. వసును చూసి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే వెళ్లిన వసు.. మను మీద నీ ఉద్దేశం ఏంటో చెప్పు అనగా.. మను చిన్నప్పటి నుంచి సమస్యలు పడుతున్నాడని, తండ్రి కోసమే ఆరాట పడుతున్నాడని చెప్పుకొస్తుంది. తన మైండ్ డైవర్ట్ చేద్దామని ఇలా చేస్తున్నానంటూ వివరిస్తుంది. మనుకు తల్లి ప్రేమ, తండ్రి గురించి కనుక్కోవడం తప్ప ఇంకేవీ తెలియవని.. వాటి నుంచి బయటకు తీసుకు రావాలంటే ఇలాగే చేయాలంటూ ఏంజెల్ వెల్లడిస్తుంది. అలాగే అనుపమ మనును కొడుకుగా స్వీకరించే వరకు మను విశ్వాన్ని దూరం పెడతానని ఇప్పటికే చెప్పాడు కదా.. అప్పటి వరకు విశ్వం ఆగలేడు.. అందుకే వాళ్లిద్దరినీ దగ్గర చేయాలని నేనిలా చేస్తున్నానంటూ చెప్పుకొస్తుంది. ఇక ఆ తర్వాత మహేంద్ర, వసులు కలిసి అనుపమ పెద్దమ్మ వద్దకు వెళ్తారు. మను గురించి చెప్పమని, మను తండ్రి ఎవరో తెలుసుకోవడానికి మేమిలా చేస్తున్నామని అంటాడు.

Anupama Argues With Mahendra About Manu Father on Guppedantha Manasu May 29th 2024 Episode 1087

మను, అనుపమల గతం ఏంటో మీకు మాత్రమే తెలుసని.. ఆ డౌట్లను మీరే క్లారిఫై చేయాలంటాడు. వారిద్దరికీ ఎందుకు గొడవ వచ్చిందని అనగా.. తండ్రి విషయంలోనే అంటుంది. తండ్రి విషయంలో మను ఇన్ని బాధలు అనుభవిస్తుంటే.. అనుపమ నోరు ఎందుకు విప్పట్లేదని చెబుతుంది. అనుపమ సమస్యలు అనుపమకు ఉన్నాయి, నిజం చెబితే మరిన్ని సమస్యలు వస్తాయని అంటుంది. మీకు నిజం ఏంటో తెలుసు.. మను తండ్రి ఎవరో చెప్పండి అంటూ అడుగుతాడు. అనుపమకు పెళ్లి కాలేదు కదా అనగా.. కాలేదని చెబుతుంది. కన్నతల్లే కన్నబిడ్డకు తండ్రి ఎవరో చెప్పనప్పుడు.. నేను చెప్పడం సబబు కాదని అంటుంది. కానీ చెప్పమని అంటాడు మహేంద్ర. అప్పుడే అనుపమ ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు చెప్పాలని అడుగుతుంది. దీంతో ముగ్గురూ షాక్ అయి లేచి నిలబడతారు.

ఏంటి మహేంద్ర ఇది అంటూ అడగ్గా.. నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నానని చెబుతాడు. ఇప్పుడు ఏకంగా నువ్వు మా పెద్దమ్మ దగ్గరకే వచ్చావనగా.. వాడిని పాతికేళ్లు పెంచిన తల్లే చెప్పట్లేదు, నీకెందుకు అంత ఆరాటం అని అంటుంది. ఏంటీ పెంచిన తల్లా అని మహేంద్ర అంటాడు. పెంచిన తల్లి కాదు కన్నతల్లి అంటూ అనుపమ కవర్ చేస్తుంది. అసలు నువ్వు తల్లివేనా, మను నిజంగా నీకే పుట్టాడా, ఒక కన్నతల్లి ఎప్పుడూ ఇలా మాట్లాడదు అంటూ అంటాడు. అసలు నువ్వెవరు మా జీవితాల్లోకి రావడానికి అంటూ అనుపమ అనగా.. ఏంటి, మళ్లీ చెప్పు అంటాడు. నేనెవరినో నీకు తెలీదా అనగా.. నువ్వు నా ఫ్రెండ్ వే.. ఫ్రెండ్ షిప్ కు అర్థం ఏంటంటే.. కష్టాల్లో ఉన్న వాళ్లకు సాయం చేయడం అంటుంది. మరి నేను చేసేది అదే కదా అనగా.. ఇది వేరు అంటుంది అనుమప.

మను తండ్రి ఎవరో చెబితే అన్ని సమస్యలు తీరుతాయని.. చెప్పు అంటూ అడుగుతాడు. కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేననగా.. నీకనవసరం, మనుకు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో అంటుంది అనుపమ. గొడవ పెద్దదవవడం చూసి వసు మహేంద్రను తీసుకు వెళ్తుంది. అప్పుడే అనుపమ పెద్దమ్మ.. మహేంద్రతో నువ్వు ఇలా మాట్లాడడం సరికాదని చెబుతుంది. తను ఫీల్ అయి ఉంటాడని అనగా.. ఫీల్ అయితేనే దీన్ని మహేంద్ర వదిలేస్తాడని చెబుతుంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదని చెబుతుంది. ఆ తర్వాత వసు.. మహేంద్రతో మాట్లాడుతూ.. ఇదంతా వదిలేయమని చెబుతుంది. తను ఒక ఎండీ అంతే పర్సనల్ విషయాలు పట్టించుకోవద్దంటూ వివరిస్తుంది. నేను మనుకు మాటిచ్చానని చెప్పగా.. బ్రేక్ చేయమంటుంది. మీరు తీసుకునే నిర్ణయం వల్ల అనేక సమస్యలు వస్తాయని.. అది ఎవరికీ మంచిది కాదంటూ వివరిస్తుంది. ఎవరికి మంచిది కాదో చెప్పమ్మా అంటూ అడుగుతాడు.

నీ మాటలు చూస్తుంటే నీక్కూడా నిజం తెలుసనిపిస్తుందని.. ఏంటో చెప్పు అంటూ అడుగుతాడు. చెప్పు వసుధార నిజం చెప్పు అంటాడు. మను తండ్రి ఎవరో నీకు చెప్పింది కానీ తన కొడుక్కు చెప్పలేదా అంటాడు. మను అంత బాధ పడుతున్నా అనుపమ మేడమ్ ఆ సమాధానం చెప్పట్లేదంటే.. దాని వెనుక ఏదో పెద్ద కథ ఉందని మీకెందుకు అర్థం కావట్లేదంటుంది. అసలు మీరు కాలేజీకి రండి, ఖాళీగా ఉండడం వల్లే మీరిలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతుంది. బోర్డు మెంబర్ గా కూడా లేను కదా అనగా.. ఫర్వాలేదు రండి అని చెబుతుంది. సరేనంటాడు మహేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X